ఎంపీలు వీధి రౌడీల్లా కొట్టుకున్న ఘటన కొసావో పార్లమెంట్లో(Kosovo Parliament)చోటు చేసుకుంది. సెర్చ్ జాతీయులతో ఘర్షణలను తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రధాని అల్బిన్ కుర్టి (PM Albin Kurti) వివరిస్తున్నారు. ఆ సమయంలో ప్రతిపక్ష సభ్యుడు మెర్గిమ్.. ప్రధాని వైపు వెళ్లి నీళ్లు చల్లడంతో కొందరు అడ్డుకున్నారు. అడ్డం వచ్చిన మహిళా సభ్యురాలని పక్కకు తోసేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social media)లో వైరల్‌గా మారింది.
కొన్నాళ్లుగా జాతులపరమైన ఘర్షణలతో ఉత్తర కొసావాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిలో అంతర్జాతీయ శాంతి దళాలకు చెందిన పలువురు సైనికులు (Soldiers) గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మరికొంత మంది సైనికుల్ని నాటో అక్కడికి తరలించింది. కొసావో ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యల్ని తీసుకుంటామని చెప్పింది. స్థానిక ఎన్నికలతో కొసావోలో గొడవలు మొదలయ్యాయి. దీంతో భద్రతా సిబ్బంది(Security personnel) జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. ఓ లీకైన ఆడియోపై చర్చ సందర్భంగా ఈ గొడవ జరిగింది. దీంతో పార్లమెంట్‌ను రెండు గంటలపాటు వాయిదావేశారు.