ఏపీలో బీజేపీ (AP BJP) పోత్తుల పరిస్థితి గందరగోళంగా ఉంది.నూతన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరి జనసేనతో సమన్వయం చేసుకుని ముందుకు సాగుతామని చెబుతుంటే.. బీజేపీ ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి(Adinarayana Reddy) మాట్లాడేతూ టీడీపీ-జనసేన(Janasena) -బీజేపీ పొత్తు ఉంటుందన్నారు. అధ్యక్షురాలు జనసేనతో పొత్తు గురించి మాత్రమే చెబితే.. మరో నేత టీడీపీతో పొత్తు ఉంటుందని చెప్పారు. దీంతో ఏది నిజమో తెలియని పరిస్థితి నెలకొంది. వైసీపీ(YCP) ఒంటరిగానే ఉంది. జనసేన-బీజేపీ మాత్రం కలిసే ఉన్నట్లు చెబుతుంటాయి. అయితే, కలిసి పని చేసిన సందర్భాలు చాలా తక్కువ.
మరోవైపు జనసేన-టీడీపీ (TDP) పొత్తు కూడా దాదాపు ఖాయమే అనే ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. అసలైన చిక్కు వచ్చింది మాత్రం టీడీపీతో జనసేన-బీజేపీ కలిసి ఉండటం.ఈ విషయంలోనే స్పష్టత రావడం లేదు. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందని పవన్, చంద్రబాబు భావిస్తున్నారు. ఈ విషయంలో పవన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తెలుగుదేశం పార్టీ పొత్తు విషయంలో బీజేపీ ఏటు తేల్చలేదు. ఈ సమయంలో జనసేన పరిస్థితి సందిగ్ధంలో పడింది. టీడీపీతో బీజేపీ కలవకుంటే ఏం చేయాలో తెలియని స్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీతో ఉండాలా.. ఆ పార్టీని వదిలి టీడీపీతో వెళ్లాలా అనేది తేల్చుకోలేకపోతున్నాడు పవన్.పొత్తు విషయంలో పురందేశ్వరి(Purandeshwari), ఆదినారాయణ రెడ్డి చెప్పిన విషయాల్లో స్పష్టత కరువైంది.
ఇద్దరి మాటల్లోనూ బేధం కనిపిస్తోంది. మరోవైపు టీడీపీతో పొత్తు గురించి హైకమాండ్ (High Command) నుంచి ఏ విధమైన స్పష్టత రాలేదు. ఇంకోవైపు కేంద్రంలో వైసీపీ చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏకంగా మంత్రివర్గంలో చేరుతుందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు టీడీపీతో కూడా ఈ మధ్య బీజేపీ చర్చలు జరుపుతున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ.. వైసీపీతో ఉంటుందా..? తటస్థంగా ఉంటుందా..? లేక జనసేన-టీడీపీ కూటమితో కలుస్తుందా..? అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. లేక ఇదంతా బీజేపీ మైండ్ గేమా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.