Mahesh babu: మహేష్ 3 నెలలు ట్రైనింగ్.. రాజమౌళిని తట్టుకుంటాడా?
రాజమౌళితో సినిమా అంటే మామూలు విషయం కాదు. ఏండ్లకేండ్ల సమయాన్ని కేటాయించడమే కాదు.. ఎంతో హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. బాహుబలి సమయంలో ప్రభాస్, ట్రిపుల్ ఆర్ టైంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ను తనకు కావాల్సిన అవుట్ పుట్ వచ్చే వరకు వదల్లేదు జక్కన్న. అలాంటిది మహేష్ బాబును వదులుతాడా.. ఛాన్సే లేదు. అందుకే.. ఓ మూడు నెలల పాటు కఠోర ట్రైనింగ్ తీసుకోబోతున్నాడు మహేష్.
ట్రిపుల్ ఆర్(RRR)తో ఆస్కార్ అందుకొని హిస్టరీ క్రియేట్ చేసిన రాజమౌళి(Rajamouli) నుంచి.. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు వరల్డ్ వైడ్ మూవీ లవర్స్. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు చెప్పేశాడు. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా.. ఈ ప్రాజెక్ట్‌ను అఫిషీయల్‌గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh babu) ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోగానే.. వెంటనే రాజమౌళి(Rajamouli)తో చేతులు కలపనున్నాడు మహేష్ బాబు. గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు జక్కన్న. హాలీవుడ్ రేంజ్లో వెయ్యి కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఇండియానా జోన్స్ తరహాలో ఫ్రాంచైజీలను ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సాహసవీరుడిగా కనిపించనున్నాడు. దాంతో భారీ యాక్షన్స్ సీక్వెన్స్‌లు ఉండనున్నాయి. అలా చేయాలంటే.. మహేష్ బాబు(Mahesh babu) మరింత ఫిట్‌గా మారాల్సి ఉంది. అందుకే తన పాత్రకు తగట్లు మహేష్‌ని మలిచేందుకు రెడీ అవుతున్నాడట రాజమౌళి.
అందుకే ఈ సినిమా కోసం మహేష్ బాబు(Mahesh babu)కి మూడు నెలలు ట్రైనింగ్ ఇప్పించబోతున్నాడట. బ్యాంకాక్‌లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోనున్నాడట. ఇప్పటికే ప్రత్యేకమైన యుద్ధ విద్యల్లో శిక్షణ కోసం విదేశాలకు వెళ్లాలని మహేష్ బాబుకి సూచించారట రాజమౌళి(Rajamouli). అయితే మామూలుగానే మహేష్ బాబు ఫారిన్ వెకేషన్ అంటూ తిరుగుతుంటాడు. ఎండలు అస్సలు పడవు. అలాంటి రాజమౌళిని మహేష్ బాబు ఎంత వరకు తట్టుకుంటాడు? అనేది వేచి చూడాల్సిందే.