»Shah Rukh Khan Reveals What Wife Gauri Loved About Jawan Preview Women Power
Shah Rukh Khan: షారుఖ్ ‘జవాన్’పై ఆయన భార్య గౌరీ రియాక్షన్ ఇదే..!
బాలీవుడ్ బాద్షా హీరోగా షారూఖ్ ఖాన్ హీరోగా అట్లీ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ జవాన్. పఠాన్ తరువాత కింగ్‌ఖాన్‌కి ఈ ఏడాది రెండో సినిమా ఇది. జవాన్ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దీపికా పదుకొణె, నయనతార, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హిందీతోపాటు తెలుగు, తమిళంలో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను మూవీ యూనిట్ షూరు చేసింది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న జవాన్ ట్రైలర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని వీడియోలు లీక్ అవ్వగా మంచి బజ్ ఏర్పడింది. ట్రైలర్‌తో అంచనాలు రెట్టింపు అయ్యాయి.
కాగా ఈ మూవీ ట్రైలర్ ని చూసిన తర్వాత షారూక్ భార్య గౌరీ చాలా సంతోషించిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ట్రైలర్ లో ఉమెన్ పవర్ చూపించిన విధానం గౌరీకి చాలా బాగా నచ్చింది అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా ట్రైలర్ విషయానికి వస్తే షారుఖ్ ఖాన్ వాయిస్‌తో ట్రైలర్‌ను ప్రారంభించారు. ‘నేనెవరో నాకు తెలియదు. నాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు. నేను ఎవర్నీ కాను.. తెలియదు.. నేను మంచివాడినా..? చెడ్డవాడినా..? పుణ్యాత్ముడినో.. పాపాత్ముడినో.. నీకు నువ్వే తెలుసుకో.. ఎందుకంటే నేనే నువ్వు.. రెడీ’ అంటూ షారూఖ్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ట్రైలర్లో విజయ్ సేతుపతి, నయనతార, దీపికా పదుకొణె లుక్స్ కూడా చూపించారు. ఈ మూవీలో దీపికా అతిథి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.