రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు ఆధారాలు చూపాలని మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. రుజువు చూపిస్తే తన ఎంపీ పదవీకి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
ఉచిత విద్యుత్‌పై రేవంత్ చేసిన కామెంట్లపై దుమారం కొనసాగుతూనే ఉంది. రైతులకు క్షమాపణ చెప్పేవరకు ఊరిలో తిరగనివొద్దు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
విద్యుత్ సంస్థలను బీఆర్ఎస్ సర్కార్ నష్టం కలిగించిందని.. అందుకే సబ్ స్టేషన్ల ఎదుట నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో అమ్మాయిల మిస్సింగ్ గురించి చేసిన కామెంట్లపై పోసాని కృష్ణ మురళి స్పందించారు. అసలు భీమవరంలో పవన్ ఓటమికి టీడీపీనే కారణమని అన్నారు. పవన్ను అస్సలు సీఎం చేయరని, నిన్ను కూరలో తాలింపు మాదిరిగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయ్యే అవకాశాలు పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఉన్నాయి. ఏపీలో వాలంటరీ వ్యవస్థ చాలా ఉన్నతమైనది అంటున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య- కడియం శ్రీహరి మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజయ్యను పిలిపించుకొని మాట్లాడటంతో వివాదం సద్దుమణిగింది.