»Protest At Substations Tpcc Chief Revanth Reddy Call To Leaders
Revanth Reddy: సబ్ స్టేషన్ల వద్ద నిరసనలకు పిలుపు.. ఎందుకంటే..?
విద్యుత్ సంస్థలను బీఆర్ఎస్ సర్కార్ నష్టం కలిగించిందని.. అందుకే సబ్ స్టేషన్ల ఎదుట నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Protest at substations, TPCC Chief Revanth Reddy Call To leaders
Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫ్రీ పవర్‌పై లొల్లి జరుగుతోంది. తానా సభ వేదికపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. బీఆర్ఎస్ నిరననలకు పిలుపునివ్వగా.. కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Revanth Reddy) సత్యగ్రహ దీక్షను నీరుగార్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. ఉచిత విద్యుత్‌పై దృష్టి మరల్చేందుకు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు బీజేపీ బీ టీమ్ అని రుజువు అయ్యిందని విమర్శించారు. 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను కేసీఆర్ (kcr) సర్కార్ మోసం చేస్తుందని విమర్శించారు. 12 గంటల నాణ్యమైన విద్యుత్ కూడా ఇవ్వడం లేదని.. ఈ విషయం ఏ సబ్ స్టేషన్‌కు వెళ్లిన తెలుస్తోందని చెప్పారు.
విద్యుత్ సంస్థలను అప్పుల్లో ముంచింది కేసీఆర్ (kcr) అని విమర్శించారు. 60 వేల కోట్ల అప్పుల్లో ముంచి.. సీఎం కేసీఆర్ (kcr) నీతిసూత్రాలు చెబుతారని తెలిపారు. దీనికి నిరసనగా సబ్ స్టేషన్ల ముందు నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ సీతక్క (seethakka) అన్నారు. ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంపై పేటెంట్ కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka) అన్నారు. విద్యుత్ కొనుగోలులో జరిగిన అవినీతిని బయటపెడితే.. తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ (ponnam prabhakar) విమర్శించారు. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (jeevan reddy) డిమాండ్ చేశారు.
ఇటు 8 గంటల కరెంట్ చాలు అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన కామెంట్స్‌కు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకు దిగారు. ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ పార్టీ తన అక్కసు వెళ్లగక్కిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మండల కేంద్రాలు, పట్టణాల్లో నిరసనలు చేపడుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) సూచన మేరకు బీఆర్ఎస్ నేతలు ఆందోళన బాట పట్టారు.