»Tomato Price Reached Rs 200 Can Go Towards Rs 250
Tomato Price Hike: డబుల్ సెంచరీ కొట్టిన టమాటా ధర.. వచ్చే వారం మరో రూ.50పెరిగే అవకాశం
టమాటా ధరల పెరుగుదల కొనసాగుతోంది. దేశంలో టమాట ధర రూ.200 దాటింది. రాబోయే రోజుల్లో ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టమాటా ధర రూ.250 దాటుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
The price of tomatoes has risen. In Madhya Pradesh Rs. 160
Tomato Price Hike: టమాటా ధరల పెరుగుదల కొనసాగుతోంది. దేశంలో టమాట ధర రూ.200 దాటింది. రాబోయే రోజుల్లో ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టమాటా ధర రూ.250 దాటుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలో ప్రస్తుతం టమాట సగటు ధర రూ.108కి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి పంజాబ్, హర్యానా వరకు టమాట ధరలు రాకెట్ వేగంతో పెరిగాయి. దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా సరఫరా నిలిచిపోయి.. ఉత్పత్తి తగ్గి.. ధరలు పెరుగుతున్నాయి.
ఈ నగరాల్లో రూ.200
వినియోగదారుల వ్యవహారాల శాఖ వెబ్సైట్ ప్రకారం.. భటిండాలో టమాటా ధర కిలో రూ.203కి చేరింది. మరోవైపు బర్నాలాలో టమాటా ధర కిలో రూ.200కి పడిపోయింది. మరోవైపు దేశంలో చాలా నగరాల్లో టమాటా ధరలు రూ.150 దాటి పరుగులు తీస్తున్నాయి. ధర్మశాల, మెయిన్‌పురి, రైసెన్, ధర్ణి, ఝలావర్, సాహిబ్‌గంజ్, శ్రీముక్త్సర్ సాహిబ్‌లలో టమాట కిలో రూ.160కి, హోషియాపూర్‌లో కిలో రూ.158కి చేరింది. మరోవైపు లఖింపూర్ ఖిరీలో టమాటా ధర కిలో రూ.180కి పడిపోయింది. బస్తీలో రూ.153, సింగ్రోలిలోని గౌతంబుద్ నగర్లో రూ.150, బరన్‌లో రూ.155, ఫిరోజాబాద్‌లో రూ.155 చేరింది.
మరోవైపు కర్నాటకలోని బాగల్కోట్లో తక్కువ ధరకు టమాటా విక్రయాలు జరుగుతున్నాయి. అక్కడ కిలో రూ.34కు లభిస్తోంది. అస్సాంలోని బార్పేట నగరంలో టమాటా ధర కిలో రూ.40 లోపే ఉంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం బార్పేటలో టమాట ధర కిలో రూ.38కి విక్రయిస్తున్నారు. అస్సాంలోని ఉదల్గురి నగరంలోనే టమోటాలు రూ.39కి విక్రయిస్తున్నారు. అస్సాంలోని సోనిత్పూర్, తేజ్‌పూర్, హఫ్లాంగ్లలో టమాటా ధర రూ.40 లోపే ఉంది. దక్షిణ భారతదేశంలోని కోలార్ ప్రాంతంలో టమోటాలు కిలో ధర రూ. 39కి విక్రయిస్తున్నారు.
రూ.250 వరకు పెరిగే ఛాన్స్
ప్రస్తుతం హిమాచల్ నుంచి వస్తున్న టమాటా ధరలను బట్టి ప్రస్తుతం రేటు నిర్ణయిస్తున్నామని ఢిల్లీ ఘాజీపూర్ కూరగాయల మార్కెట్ అధ్యక్షుడు సత్యదేవ్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ మాత్రమే దేశం మొత్తానికి టమాటాలను సరఫరా చేస్తోంది. డిమాండ్ ఎక్కువగా ఉంది. సరఫరా చాలా తక్కువగా ఉంటుంది. వర్షం కారణంగా రవాణాకు కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరో వారంలో టమాటా ధర రూ.250, అంతకు మించి పెరగవచ్చు. జూలై నెలలో టమోటాలకు సంబంధించి చాలా సమస్యలు ఉండవచ్చు. ఎందుకంటే చరిత్రలో తొలిసారిగా టమాటా ధర రూ.200 దాటింది.