BRO : `బ్రో`సినిమాకు త్రివిక్రమ్ రెమ్యునరేషన్ తెలిసి షాక్ అవుతున్న జనాలు
తమిళ సూపర్ హిట్ 'వినోదయ సీతం'కి రీమేక్ అయిన ఫాంటసీ కామెడీ డ్రామా ఇది. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 28న గ్రాండ్ రిలీజ్ కానుంది.ఈ సినిమాపై భారీ హైప్ పెంచేందుకు మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ రిలీజ్ చేస్తున్నారు.
BRO : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో వస్తున్న మెగా మల్టీస్టారర్ “బ్రో`. ఈ చిత్రానికి డైరెక్టర్ కమ్ యాక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతికా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ సూపర్ హిట్ ‘వినోదయ సీతం’కి రీమేక్ అయిన ఫాంటసీ కామెడీ డ్రామా ఇది. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 28న గ్రాండ్ రిలీజ్ కానుంది.ఈ సినిమాపై భారీ హైప్ పెంచేందుకు మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ సినిమాకు త్రివిక్రమ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి వినోద సీతమ్ చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్రఖని ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించే అవకాశం వచ్చినా త్రివిక్రమ్ హ్యాండే మెయిన్.
స్క్రీన్ ప్లే మాత్రమే కాకుండా మాటలు కూడా ఇస్తూ.. స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేసాడు త్రివిక్రమ్. అందుకే ఈ సినిమా కోసం రూ. 15 కోట్ల రెమ్యూనరేషన్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ ముందు కొందరు హీరోలు కూడా సరిపోరని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మహేష్ బాబుతో త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.