»Posani Krishna Murali Tdp Is The Reason For Pawan Loss In Bhimavaram
Posani krishna murali: భీమవరంలో పవన్ ఓటమికి టీడీపీనే కారణం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో అమ్మాయిల మిస్సింగ్ గురించి చేసిన కామెంట్లపై పోసాని కృష్ణ మురళి స్పందించారు. అసలు భీమవరంలో పవన్ ఓటమికి టీడీపీనే కారణమని అన్నారు. పవన్ను అస్సలు సీఎం చేయరని, నిన్ను కూరలో తాలింపు మాదిరిగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan) వాలంటీర్లు అనేక మంది అమ్మాయిలు మిస్సవడానికి కారణమవుతున్నారని చేసిన వ్యాఖ్యలపై పోసాని కృష్ణ మురళి(posani krishna murali) ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఇళ్లల్లో ఆడవాళ్ల గురించి మాత్రమే అడుగుతావు. కానీ టీడీపీ నేత నారా లోకేష్ ఎంత మంది అమ్మాయిులతో ఉన్నారో చుశావా ? మీకు తెలుసా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఏది చెబితే దానికే స్పందిస్తున్నావని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ కు ఇవన్నీ కనపడలేదా అని అన్నారు. లోకేష్ బాబు చేసినట్లుగా ఎవరైనా ఉన్నారా అంటూ దుయ్య బట్టారు. వీటన్నిటికి పవన్ కల్యాణ్ సిగ్గుపడాలని చెప్పారు. నీ లక్ష్యం జగన్(jagan) రాజకీయ జీవితం నాశనం కావడమేనని పోసాని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రజలు దీవించినంత కాలం ఎవ్వరూ నాశనం కారని పోసాని హితవు పలికారు. అసలు ఎవరు మిస్సయ్యారో ఒక్క 10 మంది ఆడపడుచుల పేర్లు పవన్ చెప్పాలని కోరారు. నువ్ చెప్పలేవని ఎందుకంటే.. నువ్వు చంద్రబాబు గుప్పిట్లో ఉన్నావని నీన్ను వాడుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల తర్వాత నిన్ను కురలో తాలింపు మాదిరిగా తీసేస్తారని ఎద్దేవా చేశారు. నిన్ను పొరపాటును కూడా సీఎంను చేయ్యరని అన్నారు. పవన్ భీమవరంలో టీడీపీ(TDP) వల్లనే ఓడిపోయాడని ఆరోపించారు. పవన్ కల్యాణ్ ఇప్పటికైనా నిజం తెలుసుకోవాలని పోసాని అన్నారు.