Ayyannapatrudu: టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ పెళ్లి గురించి సీఎం జగన్‌కు ఎందుకు అని అడిగారు. ఆయన నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే మీకేం సమస్య అని అడిగారు. అనకాపల్లిలో అయ్యన్నపాత్రుడు టీడీపీ శ్రేణులతో మాట్లాడారు. జగన్ వైసీపీ పార్టీని ఏర్పాటు చేసినట్టు.. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించారని తెలిపారు. పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడడానికి మీరు ఎవరు అని అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) అడిగారు. వద్దు అని చెప్పడానికి మీకు ఏం హక్కు ఉందన్నారు. జనసేనకు వస్తోన్న ఆదరణ చూసి తట్టుకోలేక ఇలా మాట్లాడుతున్నారని తెలిపారు. పవన్ కల్యాణ్‌కు ఓపిక ఉంది.. అందుకే చేసుకున్నారు కావొచ్చు అని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.
ఇటీవల సీఎం జగన్ పవన్ కల్యాణ్ (pawan kalyan) నాలుగు పెళ్లిళ్ల గురించి కామెంట్స్ చేశారు. 4 పెళ్లిళ్లు చేసుకుంటారు.. నిలకడగా ఉండరు అని విమర్శించారు. దానిపై జనసేన నేతల నుంచి రియాక్షన్స్ వచ్చాయి. టీడీపీ నేతలు కూడా ఖండించారు. ఈ రోజు అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) మాట్లాడారు. సీఎం జగన్‌ను విమర్శించారు.