KTRకు కోమటిరెడ్డి ఛాలెంజ్.. 24 గంటలు ఉచిత్ విద్యుత్ ఇస్తే రాజీనామా చేస్తా
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు ఆధారాలు చూపాలని మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. రుజువు చూపిస్తే తన ఎంపీ పదవీకి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
Komatireddy Venkat Reddy: ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్- కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ పీక్‌కి చేరింది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అలా ఇస్తున్నట్టు రుజువు చూపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ప్రశ్నించారు. ఆధారాలు చూపిస్తే.. రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్‌కు (ktr) సవాల్ విసిరారు. సిరిసిల్లలో ఏ సబ్ స్టేషన్ నుంచి అయినా రైతులకు 24 గంటల త్రి ఫేజ్ కరెంట్ ఇస్తున్నారా అని అడిగారు.
సిరిసిల్లే కాదు సిద్దిపేట, గజ్వేల్ ఏ సబ్ స్టేషన్‌కైనా వెళదాం అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అడిగారు. అక్కడ గల లాక్ బుక్కుల్లో 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టు చూపిస్తే జీవితాంతం బీఆర్ఎస్ పార్టీకి సేవ చేస్తానని ప్రకటించారు. కేసీఆర్, కేటీఆర్ ప్లెక్సీకి పాలాభిషేకం చేస్తానని వివరించారు. ఒక్కొ ఎమ్మెల్యే వెయ్యి కోట్లు తిని.. అరగక ధర్నా చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. తన సవాల్ స్వీకరించాలని.. కనీసం 6 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారో చూపించాలని కోమటిరెడ్డి (Komatireddy) డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సత్యగ్రహ దీక్ష భగ్నం చేయడానికి బీఆర్ఎస్ నేతలు కుట్ర పన్నారని కోమటిరెడ్డి (Komatireddy) ఆరోపించారు. కాంగ్రెస్ బలపడుతుందనే భయం బీఆర్ఎస్ భయపడుతుందని తెలిపారు. రేవంత్ ఈ రోజు రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు.. రేపు పీసీసీ చీఫ్‌తో కలిసి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.