Manik rao thakre talks about telangana cm candidate
Manik rao thakre: తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. ఉచిత విద్యుత్‌పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌తో దుమారం చెలరేగింది. దీంతోపాటు సీఎం అభ్యర్థిపై రేవంత్ చేసిన కామెంట్స్‌తో రేసులో ఎవరెవరూ ఉన్నారనే చర్చ జరుగుతుంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే (Manik rao thakre) స్పందించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని.. ఎవరైనా సీఎం కావొచ్చని స్పష్టంచేశారు.
తమ పార్టీలో ఒక్కరు కాదు చాలా మంది సీఎం అభ్యర్థులు ఉన్నారని ఠాక్రే (Manik rao thakre) చెప్పారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్, దామోదర రాజనర్సింహ, మల్లు భట్టి విక్రమార్క ఇలా మంది ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలా కాంగ్రెస్ పార్టీ కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో అయితే కుటుంబంలోని వారే సీఎం అవుతారని విమర్శించారు. అదే కాంగ్రెస్ పార్టీలో అయితే అభ్యర్థులకు కొదవలేదని.. ఇందరు ఉన్నప్పటికీ హై కమాండ్ నిర్ణయే ఫైనల్ అని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో జాతీయ భావాలు ఎక్కువ అని.. స్వేచ్చ కూడా ఉంటుందని చెప్పకనే చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో అలాంటి పరిస్థితి ఉందా అని అడిగారు. అమెరికా నుంచి బయల్దేరిన రేవంత్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ చేరుకుంటారు. రేపు టీ పీసీసీ సమావేశం కానుంది.