Purandeswari: సొంత బాబాయ్‌ని చంపి, విద్యార్థిని కూడా వదల్లేదని జగన్‌పై నిప్పులు
సొంత బాబాయ్‌ని చంపించి, పదో తరగతి విద్యార్థిని కూడా వదలని కర్కశకుడు సీఎం జగన్ అని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. ఈ రోజు ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవీని స్వీకరించారు.
Purandeswari: ఏపీ సర్కార్‌పై బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నాసికరం మద్యం విక్రయిస్తున్నారని ఫైరయ్యారు. దశలవారీగా మద్య నిషేధం విధిస్తామని చెప్పి.. ఎందుకు బ్యాన్ చేయడం లేదని అడిగారు. మద్యం విక్రయాల్లో స్కాం జరుగుతోందని ఆరోపించారు. మద్యం, భూ దోపిడీ, ఇసుక దోపిడీ పెద్ద ఎత్తున జరుగుతోందని తెలిపారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా విజయవాడ పార్టీ కార్యాలయంలో ఈ రోజు బాధ్యతలను స్వీకరించారు. ఏపీ మాజీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. మిఠాయి తినిపించి, అభినందనలు తెలిపారు.
సీఎం జగన్ సొంత లాభం చూసుకుంటారని పురందేశ్వరి (Purandeswari) విరుచుకుపడ్డారు. సొంత బాబాయ్‌ని చంపించారని హాట్ కామెంట్స్ చేశారు. పదో తరగతి విద్యార్థిని కూడా వదల్లేదని మండిపడ్డారు. ఏపీలో హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఫైరయ్యారు. జగన్ సర్కార్ చేసే తప్పులను ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. ఇన్ని తప్పులు చేసిన వైసీపీకి అధికారంలో కొనసాగే అర్హత లేదని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో బీజేపీతో ఉన్నారని.. ఇప్పుడు కూడా తమతో ఉంటారని క్లారిటీ ఇచ్చారు.
ఏపీలో రాహదారులు పరిస్థితి దారుణంగా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం చొరవతో రోడ్ల నిర్మాణం జరుగుతుందని పురందేశ్వరి తెలిపారు. ఒక రోడ్డు కూడా ఏపీ సర్కార్ వేయలేదని.. ఈ విషయం ప్రజలను అడిగిన చెబుతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ సర్కార్ 22 లక్షల ఇళ్లను ఇచ్చిందని.. అందులో 35 శాతం ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని విమర్శించారు. సీఎం జగన్ వల్ల రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలు ముందుకు వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఉన్న కంపెనీలు తిరిగి వెళ్లే పరిస్థితి అని వివరించారు.