MDK: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియామకమైన ఆంక్షారెడ్డిని కాంగ్రెస్ నాయకులు శనివారం రాత్రి సన్మానించారు. ఆమె ప్రత్యేకంగా రూపొందించిన మహిళా పథకంపై అవగాహన కల్పించేందుకు మల్కాపూర్ తాండ, నర్సంపల్లి, వెంకటాపూర్ (పిటి), బ్రాహ్మణపల్లి లలో పర్యటించారు. అదే సమయంలో జిల్లా అధ్యక్షురాలిగా నియామకమైనట్లు సమాచారం రావడంతో ఆమెను సన్మానించారు.