BJP MP Arvind: సీఎం కేసీఆర్ (cm kcr) చేతిలో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) కీలుబొమ్మ అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (BJP MP Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ (kcr) ఆడించినట్టు రేవంత్ (revanth) ఆడుతున్నారని విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ (kcr) డబ్బులు పంపిస్తారని.. వాటిని రేవంత్ మీడియా సంస్థలకు అందజేస్తారని ఆరోపించారు. దీంతో మీడియా రేవంత్, కాంగ్రెస్ పార్టీకి హైప్ తీసుకొస్తోందని చెప్పారు. మొదట తనకు కూడా ఈ విషయం తెలియదని.. తర్వాతే తెలిసిందని చెప్పుకొచ్చారు.
ఎక్కువ హైప్ రావడంతో..
కేసీఆర్ (kcr) ఊహించిన దానికన్నా ఎక్కువగా రేవంత్ రెడ్డి (revanth reddy), కాంగ్రెస్ పార్టీకి (congress party) హైప్ వచ్చిందని అర్వింద్ (arvind) తెలిపారు. దీంతో రేవంత్‌కు (revanth) ఫోన్ చేసి.. దించాలని చెప్పారని వివరించారు. దించడం తనకు తెలియదని రేవంత్ (revanth) అంటే.. ఉచిత విద్యుత్ గురించి మాట్లాడాలని కేసీఆర్ (kcr) సలహా ఇచ్చారట.. అలా చెబితే జనం తనను కొడతారని అనడంతో.. ఎలాగూ అమెరికా (america) వెళుతున్నావు కదా.. అక్కడ మాట్లాడాలని సజెషన్ ఇచ్చారని పేర్కొన్నారు.
కేసీఆర్ స్క్రిప్ట్
సీఎం కేసీఆర్ (kcr) చెప్పినట్టు అమెరికా పర్యటనలో రేవంత్ (revanth) మాట్లాడారని అర్వింద్ (arvind) గుర్తుచేశారు. అమెరికా పర్యటనలో ఉండగా చర్చ జరుగుతుందని.. ఇండియా వచ్చేసరికి చల్లబడుతుందని కేసీఆర్ (kcr) తెలిపారట.. ఆయన చెప్పినట్టే అంతా జరిగిందని అర్వింద్ (Arvind) చెప్పారు. కేసీఆర్ (kcr) స్క్రిప్ట్ ప్రకారం అంతా జరిగిందని.. కానీ బయట మాత్రం కాంగ్రెస్- బీఆర్ఎస్ విమర్శలు చేసుకుంటున్నట్టు ఉందని.. అదీ నిజం కాదని అర్వింద్ (arvind) తెలిపారు.
బాబు మాట కాదు..
ఇప్పటికీ కొందరు రేవంత్ రెడ్డి (revanth reddy) టీడీపీ నుంచి వచ్చారని.. చంద్రబాబు (chandrababu) చెప్పినట్టు వింటున్నారని అంటారని.. అదీ నిజం కాదని అర్వింద్ (arvind) అంటున్నారు. రేవంత్ రెడ్డి (revanth reddy).. సీఎం కేసీఆర్ (kcr) మాట వింటున్నారని.. ఆయన చెప్పినట్టు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా బీజేపీకి హైప్ రాకుండా కేసీఆర్ (kcr) చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. అర్వింద్ (arvind) కామెంట్స్ తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో చర్చకు దారితీశాయి.
కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని లేపమని మీడియా సంస్థలకు కేసీఆర్ పైసలు పంపిస్తుండు – బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి
కాంగ్రెస్ పార్టీని లేపాలని కేసీఆర్ అనుకున్నాడు. కేసీఆర్ అనుకున్న దానికంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ హైప్ వచ్చింది. వెంటనే దించాలి అనుకుని రేవంత్ రెడ్డికి కేసీఆర్… pic.twitter.com/JoXjQitcEb