Pawan Kalyan: జగ్గూ గ్యాంగును ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు: పవన్ కళ్యాణ్
ఏపీలో సీఎం జగన్ పాలన దుర్మార్గంగా సాగుతోందని, వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా మంది యువత పరిస్థితి దారుణంగా తయారైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో జగ్గూ గ్యాంగ్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో తనకు తెలుసని, రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న జలగలను వదిలిపెట్టనని అన్నారు.
ఏపీ సీఎం జగన్(CM Jagan) తనకు శత్రవు కాదని, ఆయనకు అంత సీన్ లేదని జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫైర్ అయ్యారు. గురువారం తణుకు నియోజకవర్గం నాయకులు, వీర మహిళలతో సమావేశం నిర్వహించారు. వారితో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..ధైర్యంతో పోరాటం చేశాక బ్రిటీష్ వారే పారిపోయారని, ఇక జగన్ ఎంత అని అన్నారు. తన పోరాటం జగన్ పైన కాదని, ప్రజా సమస్యలపైనే అని తెలిపారు. జగన్ గిచ్చాడని మోదీకి ఫిర్యాదు చేస్తే బావుండని అన్నారు.
జగన్(CM Jagan) సంగతి తానే తేల్చుకుంటానని పవన్ అన్నారు. జగ్గూ గ్యాంగ్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో తనకు తెలుసని, జగన్‌ను జగ్గూ భాయ్ అంటారని, ఇప్పుడు ఆ జగ్గూభాయ్ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని పట్టిపీడిస్తున్న జలగలను వదిలిపెట్టనని స్పష్టం చేశారు. జగన్ ఓ రౌడీ పిల్లాడని అన్నారు. యువతకు రూ.100 ఇచ్చి పనిచేయిస్తున్నాడని చురకలంటించాడు.
తన కుటుంబం జోలికి వస్తే ఊరుకోనని హెచ్చరించాడు. వాలంటీర్ వ్యవస్థ రాష్ట్రంలో అవసరమే లేదన్నారు. డిగ్రీ చదివిన యువకులకు రూ.165లు ఇచ్చి పనిచేయించడం దారుణమన్నారు. కులాల పరంగా అలా ప్రతిభను వెలికి తీయొద్దని, సమర్థత పరంగా చూడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలిపారు.