ఏపీ ముఖ్యమంత్రి జగన్ (CM JAGAN) పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జగన్ దిగజారి మాట్లాడుతున్నారని తాను మాత్రం సీఎం భార్య భారతి గురించి ఏనాడు మాట్లాడలేదని పవన్ అన్నారు.తాడేపల్లిగూడెం(Tadepalligudam)లో నిర్వహించిన వారాహి విజయయాత్రలో ఆయన మాట్లాడుతూ… వాలంటీర్ వ్యవస్థ(Volunteer system)కు అధిపతి ఎవరో చెప్పాలని జగన్ ను ప్రశ్నించారు. చాలాచోట్ల వాలంటీర్లు ప్రజలను వేధిస్తున్నారని, వాలంటీర్లు అందరూ అలాంటి వారు కాదని, కానీ ఈ వ్యవస్థలోనూ కొందరు కిరాతకులు ఉన్నారని ఆరోపించారు. జగన్ ఒక సంస్కారహీనుడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్ పౌరుల వ్యక్తిగత డేటా సేకరిస్తున్నాడని.. ఆ డేటా అంతా హైదరాబాద్(Hyderabad)లోని నానక్రామ్ గూడలో ఉందని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు.వాలంటీర్లు తనకు సోదర సమానులని, వారి పొట్టకొట్టాలనేది తన ఉద్దేశం కాదన్నారు. వాలంటీర్లు అందరూ చెడ్డవారు అని తాను చెప్పడం లేదని, ఈ వ్యవస్థ ఎలా పని చేయాలో చెబుతున్నానని అన్నారు. వేతనం ఆశించకుండా పని చేసేవాళ్ళే వాలంటీర్లు, డబ్బులు తీసుకుంటే అలా ఎలా అంటారన్నారు. వాలంటీర్లు కేవలం రూ.5వేలకు పని చేస్తున్నారని, కానీ వారికి రెట్టింతలు ఇవ్వాలని కోరుకునే వాడినన్నారు.
మద్యపాన నిషేధం (Prohibition of alcohol) చేస్తామని ఏపీలో అధికారంలోకి వచ్చి, రూ.1 లక్ష కోట్లకు పైగా మద్యం అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. సంపూర్ణ మద్యనిషేధం ఎక్కడా వీలుపడలేదన్నారు. ముస్లింలకు తాను వ్యక్తిగతంగా ఇష్టమని, కానీ తాను భారతీయ జనతా పార్టీ (BJP) వైపు ఉన్నానని నమ్మడం లేదన్నారు. కానీ జగన్ ముస్లింలకు షాదీ ముబారక్ (Shadi Mubarak) తీసేశారని ఆరోపించారు. మీ మాతృభాషలో స్కూల్స్ పెట్టలేకపోయారన్నారు. నేను మాత్రం బీజేపీతో ఉన్నానా? లేదా? మీకు అనవసరమని, మీకు న్యాయం చేస్తానా? లేదా? అని చూడండన్నారు.