Asad ఎప్పడైనా ఏమైనా జరగొచ్చు.. సామాజిక కార్యకర్త సలీం వార్నింగ్
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి సామాజిక కార్యకర్త సలీం తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చాడు. అధికారం ఉంది కదా అని అమాయకులపై కేసులు పెట్టి వేధించొద్దు అని సూచించారు.
Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి (Asaduddin Owaisi) సామాజిక కార్యకర్త మహ్మద్ సలీం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వీడియోలో అసద్‌ను ఏకీపారేశారు. వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది.
‘అసద్ (Asad).. నీపై ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు.. దేవుడు ఇచ్చిన అధికారం అడ్డుపెట్టుకొని ప్రతీ ఒక్కరిపై అన్యాయంగా కేసులు పెడుతున్నావు. అధికార దాహంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నావు అని’ సలీం అందులో పేర్కొన్నారు. అధికారంలో ఉన్నాం అని విర్రవీగుతున్న నీపై ఏమైనా జరగొచ్చు. ఆ సమయంలో రక్షించడానికి అమిత్ షా, నరేంద్ర మోడీ ఇచ్చిన సెక్యూరిటీ పనిచేయదన్నారు.
అధికారం దుర్వినియోగం చేసేవారిని దేవుడు వారి నుంచి అధికారం తీసుకుంటాడు. ఒక సమయంలో సెక్యూరిటీ ఉన్నా సరే తుటాకు కుప్పకులి పోవాల్సి వస్తోంది. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ శక్తివంతమైన నేతలను భద్రతా సిబ్బంది కాపాడలేరని గుర్తుచేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో అతిక్ అహ్మద్ ఆషార్, అతని తమ్ముడు అష్రఫ్ హత్యకు గురయ్యారని గుర్తుచేశారు. సెక్యూరిటీ ఉన్నప్పటికీ ముగ్గురు యువకుల హతమార్చిన సంగతి తెలిసిందే. అలాంటి పరిస్థితి నీకు వస్తోందని తెలిపారు.మోడీ నీకు వై ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు కదా.. కాపాడుతుందని అనుకోను.. అని సలీం హెచ్చరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.