సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తమ పార్టీలో చేరాలని కేఏ పాల్ ఆహ్వానించారు. గతంలో జగ్గారెడ్డితో తనకు గొడవలు ఉండేవని గుర్తుచేశారు. అవేం తాను మనసులో పెట్టుకోలేదని వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ మరోసారి సత్తా చాటనుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో క్లీన్ స్విప్ చేయనుందని తెలిసింది. టైమ్స్ నౌ సర్వే ప్రకారం.. వైసీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది.
తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రత కోసం కర్రలు ఇస్తామని ప్రకటించిన నిర్ణయంపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) స్పందించారు. వాటిలో నిజం లేదని అన్నారు. భక్తుల భద్రత కోసం తాము ఖర్చు విషయంలో వెనుకాడబోమని అన్నారు.
వరద బీభత్సం స్థానికుల్లో భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే 71 మంది ప్రాణాలు కోల్పొయారు. రూ.10 వేల కోట్ల ఆస్తినష్టం జరిగింది. ఈ నేపథ్యంలో స్కూల్స్ అన్ని బంద్ పాటిస్తున్నాయి. కొండచర్యలు విరిగిపడడం అదనపు సమస్యగా మారింది. రాష్ట్రంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటు బతుకుతున్నారు. గత 50 ఏళ్లలో ఇలాంటి పరిస్థితులు రాలేదని హిమాచల్ ప్రదేశ్ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
జనగామ బీఆర్ఎస్ నేతలు టూరిజం ప్లాజా ఉన్నారు. హై కమాండ్ పిలిచిందని.. పనుల కోసం వచ్చామని చెప్పారు. ఇంతలో అక్కడికి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వచ్చారు. దీంతో అక్కడున్న నేతలు అంతా ఆశ్చర్యపోయారు.
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పినట్టు బీజేపీ వింటుందనే సందేహాం కలుగుతుందని మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు చేశారు. అన్నీ పార్టీలు రెడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ అనగా.. ఆ వెంటనే బండి సంజయ్‌ను తప్పించి కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలను అప్పగించిందని గుర్తుచేశారు.
టీటీడీ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వనున్నట్లు ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 18న సీఎం జగన్ చేతుల మీదుగా ఇంటి స్థలాలు ఇప్పించనున్నట్లు వెల్లడించారు.
ఏపీ మంత్రి రోజాకు జనసేన వీరమహిళ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కంత్రిలా మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోకపోతే కత్తి మహేష్‌కు ఏం జరిగిందో తెలుసు కదా అని విమర్శించారు.