Chandrababu: ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu) తడబడ్డారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పిల్లలు, వారి జీవిత లక్ష్యం అంటూ ఉపన్యాసం ఇస్తున్నారు. పిల్లలు జీవితంలో సెటిల్ కావాలని పేరంట్స్ అనుకుంటారు. ఇంజినీరింగ్ చేసి.. మంచి కంపెనీలో జాబ్ చేయాలని ఉత్సాహం చూపిస్తారు. పిల్లలు లైఫ్లో సెటిల్ అయ్యే క్షణాలు.. పేరంట్స్ 20 ఏళ్ల కల అని చెప్పారు.
అలా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు (Chandrababu) తప్పులో కాలేశారు. అవును ఇంజినీరింగ్ చదవాలని చెబుతున్నారు. ఇంజినీరింగ్ చేయాలంటే… మంచి స్కూల్లో చదవాలని.. అలాగే మంచి కాలేజీ సెలక్ట్ చేసుకోవాలని కోరారు. ఇంజినీరింగ్ చేయాలంటే ఇంటర్లో బైపీసీ చేయాలని చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఐటీ గురించి చెబుతూ.. ఇలా చంద్రబాబు తడబడటంపై సర్వత్రా విస్మయ్యం వ్యక్తం అవుతోంది. ఇంటర్లో ఎంపీసీ చేస్తే ఇంజినీరింగ్, బైసీపీ చేస్తే మెడిసిన్ చదువులు ఉంటాయనే సంగతి తెలిసిందే.
చంద్రబాబు (Chandrababu) మాత్రం ఇంటర్లో బైసీపీ చేసి.. ఇంజినీరింగ్ చేయాలని కొత్త భాష్యం చెప్పారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. బాబు.. ఏంటీ ఇదీ.. ఇంజినీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలా..? అని అడుగుతున్నారు. మీరు కూడా ఇలానా.. ఐటీ అంటారు.. సైబరాబాద్ నగరాన్ని సృష్టించామని చెప్పి.. ఇలాంటి కామెంట్స్ తగునా అని సెటైర్స్ వేస్తున్నారు. ఐటీ గురించి చంద్రబాబుకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంది.. మరీ ఇలా అతను చేసిన కామెంట్స్ నెట్టింట చర్చకు దారితీసింది.