సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తమ పార్టీలో చేరాలని కేఏ పాల్ ఆహ్వానించారు. గతంలో జగ్గారెడ్డితో తనకు గొడవలు ఉండేవని గుర్తుచేశారు. అవేం తాను మనసులో పెట్టుకోలేదని వివరించారు.
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) ఈ రోజు సంగారెడ్డిలో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jagga reddy) గురించి ప్రస్తావించారు. ఇంతకుముందు జగ్గారెడ్డి దురుసుగా ప్రవర్తించారని.. అయినప్పటికీ తాను క్షమించానని వివరించారు. ఇకపై ఊరుకునేది లేదని తనదైన కామెడీ స్టైల్లో చెప్పేశారు. గతంలో జరిగిన అంశాలను ప్రస్తావించారు. జగ్గారెడ్డిని (jagga reddy) తన పార్టీలోకి ఆహ్వానించారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో 1200 ఎకరాల్లో చారిటీ సిటీ నిర్మించానని కేఏ పాల్ (KA Paul) గుర్తుచేశారు. దానిని చూసి విదేశీ ప్రతినిధులు ఆశ్చర్యపోయారని వివరించారు. అప్పటి సీఎం వైఎస్ఆర్ తనను డబ్బులు అడిగారని సంచలన ఆరోపణలు చేశారు. డబ్బులు ఇవ్వలేదని.. చారిటీ సీటీని ఎమ్మెల్యే జగ్గారెడ్డి మూయించారని గుర్తుచేశారు. చారిటీ సిటీ విషయంలో చాలా గొడవ చేయించారని.. అయినప్పటికీ ఆయనను ఏ రోజు తాను శపించలేదని తెలిపారు.
సంగారెడ్డి నియోజకవర్గాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తన పార్టీలోకి రావాలని జగ్గారెడ్డిని కోరారు. జగ్గారెడ్డి (jagga reddy) పార్టీ మారుతున్నారనే విషయం తెలిసిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని.. ఆ పార్టీలో చేరితే రూ.1000 కోట్లు ఇస్తారని తెలిపారు. తమ పార్టీలో చేరితే పేదలకు మేలు జరుగుతుందన్నారు. అభివృద్ధి చేసే ప్రజాశాంతి పార్టీలో చేరాలని కేఏ పాల్ కోరారు. ఇక్కడ నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందని.. అందరికీ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత నేతలపై ఉందన్నారు.
ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూపై కేఏ పాల్ (KA Paul) మాట్లాడుతుంటారు. పొలిటికల్ అంశాలపై చేసే కామెంట్స్ చర్చకు దారితీస్తాయి. రాజకీయ ప్రకంపనలు రేపుతాయి. ఇప్పుడు జగ్గారెడ్డిని తన పార్టీలో చేరాలని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్లపై జగ్గారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలీ మరీ.