CM KCR Cheated Farmers: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తయారైంది తెలంగాణ సర్కార్ తీరు.. రుణ మాఫీ (Loan Waiver) పేరుతో రైతులను ఉరడించి.. ఊసురుమనిపించారు. పేరుకు రూ.99 వేల రుణ మాఫీ అని చెబుతున్నారు. అలా జరగడం లేదు. ఒక్కో రైతుకు రూ.39 వేల నుంచి రూ.40 వేల వరకు మాఫీ అవుతున్నాయి. మిగతా రూ.60 వేల సంగతిపై క్లారిటీ లేదు. అదేమని అంటే.. ఏదో ఒక సిల్లీ రీజన్ చెబుతున్నారు. ఈ రుణమాఫీ (Loan Waiver) కూడా ఎన్నికల కోసం చేస్తున్నారే తప్ప రైతులపై ప్రేమతో కాదని మరికొందరు అంటున్నారు.
వైఎస్ హయాంలో మాఫీ
ఉమ్మడి రాష్ట్రంలో.. వైఎస్ఆర్ (ysr) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రుణమాఫీ జరిగింది. అప్పుడు రైతులకు ఉన్న రుణం ఒక్కసారిగా మాఫీ అయ్యింది. ఆ తర్వాత చాలామందికి అవగాహన వచ్చి వ్యవసాయం కోసం క్రాప్ లోన్ తీసుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు రుణమాఫీ (Loan Waiver) సరిగా జరగలేదు. చిన్న, సన్నకారు రైతులు ఆశించినట్టు ఓకేసారి లోన్ మాఫీ అవ్వలేదు. ఇందుకు ప్రధాన కారణం.. రుణం తీసుకున్న వారికి గడువు విధించడం.. దాంతో కొందరికే లోన్ వర్తిస్తోంది. ఇటీవల కేసీఆర్ సర్కార్ విధించిన 2018 ఏడాది డెడ్ లైన్ కూడా అందుకు ప్రధాన కారణం అవుతోంది. మిగతావారి పరిస్థితి ఏంటీ..? వారికి రుణ మాఫీ చేయరా అనే ప్రశ్నలు వస్తున్నాయి. 2018కి ముందు తీసుకున్న వారు ఏం చేయాలి..? దాంతోపాటు రూ. లక్ష దాటిన వారి రుణ మాఫీ ఎందుకు చేయరనే ప్రశ్నలు అన్నదాతల నుంచి వస్తున్నాయి.
డెడ్ లైన్ ఎందుకు..?
సంక్షేమ పాలన అంటోన్న కేసీఆర్ గడువు తేదీ విధించడంతో మిగతా వారికి నష్టం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రుణ మాఫీ (Loan Waiver) జరుగుతోంది. కటాఫ్ విధించడంతో సమస్య వచ్చింది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. అప్పట్లో రూ.50 వేల వరకు రుణమాఫీ (Loan Waiver) చేశారు. ఆ పైన తీసుకున్న వారికి రూ.12 వేల వరకు వేశారు. ఆ డబ్బు తీసుకున్న రుణానికి సంబంధించి బ్యాంక్ అధికారులు తీసుకున్నారు. సో.. మళ్లీ లోన్ ఎప్పటిలాగే ఉంది. ఆ తర్వాత రుణ మాఫీ (Loan Waiver) అని ప్రకటన చేశారు.. జరగలేదు. ఇప్పుడు రూ.99 వేల వరకు మాఫీ అని ప్రకటించినా.. రూ.40 వేల కన్నా ఎక్కువ కావడం లేదు. అందుకు వారు కటాఫ్ అని.. మిగతా అమౌంట్ తర్వాత అని.. రకరకాల కారణాలు చెబుతున్నారు. ఆ మాటలతో అన్నదాత గుండె మరింత భారం అవుతోంది.
రైతుబంధు ఎందుకివ్వరు..?
మరో విచిత్ర విషయం తెలిసింది. కొన్ని చోట్ల రైతులు వడ్డీ కట్టకుంటే.. రైతు బంధు నగదును ద్వారా తీసుకున్నారు. ఇదేంటని అక్కడి అన్నదాతలు ఆందోళన పట్టారు. బ్యాంక్ అధికారులు వినకపోవడంతో.. చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు. ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. తీసుకున్న రుణానికి వడ్డీ కట్టలేని పరిస్థితి కొందరదీ.. అలాంటి పరిస్థితుల్లో కొత్త రుణం మంజూరు చేసే పరిస్థితి లేదు. దీంతో చిన్న, సన్నకారు రైతులు తెగ ఇబ్బంది పడ్డారు. యూరియా, విత్తనాల కోసం ఇచ్చే రైతు బంధు కట్ చేయడం పట్ల ఆగ్రహాంతో ఉన్నారు. ఇస్తోన్న రుణం మాఫీ కాదని.. వడ్డీ కింద జమ చేస్తున్నారని కొందరు రైతులు ఆగ్రహాంతో ఉన్నారు. కేసీఆర్ సర్కార్‌కి రైతులంటే ఇప్పుడే ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందని అడుగుతున్నారు. ఎన్నికల వేళ ఆకట్టుకోవడమే కదా అని చదువుకున్న రైతు బిడ్డలు చెబుతున్నారు.
రానీ కొత్త లోన్
కేసీఆర్ సర్కార్ తీరును (kcr) విపక్షాలు కూడా తప్పుపడుతున్నాయి. కేసీఆర్ సర్కార్ చేసింది రుణ మాఫీ (Loan Waiver) కాదని.. వడ్డీ మాఫీ కాని విమర్శలు చేస్తున్నాయి. పంట నష్టం రూ.10 వేలు ఏవని ప్రశ్నిస్తున్నారు. ఆ నిధులు ఎప్పుడిస్తారని అడుగుతున్నాయి. రుణ మాఫీ (Loan Waiver) అంటే సంబరపడిపోయాం.. మొత్తం లోన్ మాఫీ అవుతుందని.. కొత్త లోన్ తీసుకోవచ్చని అనుకున్నామని కొందరు రైతులు మీడియాతో చెబుతున్నారు. ఆ లోన్ మాఫీ కాలేదని తెలిసి షాక్ తిన్నం అని గుర్తుచేశారు. తమకు మళ్లీ లోన్ దొరికే పరిస్థితి లేదని వాపోతున్నారు.