Tourism Plazaలో హైడ్రామా.. బీఆర్ఎస్ నేతల మీటింగ్, ముత్తిరెడ్డిని చూసి షాక్
జనగామ బీఆర్ఎస్ నేతలు టూరిజం ప్లాజా ఉన్నారు. హై కమాండ్ పిలిచిందని.. పనుల కోసం వచ్చామని చెప్పారు. ఇంతలో అక్కడికి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వచ్చారు. దీంతో అక్కడున్న నేతలు అంతా ఆశ్చర్యపోయారు.
Muthireddy Yadagiri Reddy: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి (Muthireddy Yadagiri Reddy) ఇంట బయట చిక్కులు తప్పడం లేదు. అప్పట్లో కలెక్టర్‌తో వివాదం.. తర్వాత భూమి విషయమై కన్న కూతురితో గొడవతో ఉన్న పరువు కాస్త పోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంతలో స్థానిక నేతల తిరుగుబాటుతో ఊపిరి సలపని పరిస్థితి నెలకొంది.
జనగామ బీఆర్ఎస్ నేతలకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందని తెలిసింది. దీంతో వారు టూరిజం ప్లాజాకు వచ్చారు. మంత్రి హరీశ్ రావు (Harish rao) పిలిచారని సదరు నేతలు చెబుతున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి (rajeshwar reddy) మీట్ అవుతారనే మరో వాదన ఉంది. వారు అక్కడ ఉండగానే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మీడియాను తీసుకొని వచ్చాడు. ఎవరు.. మీ పేరు, ఇక్కడకు ఎందుకు వచ్చారనే అంశంపై అడిగారు.
ఇంతలో ఒకతను అడ్డుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు.. ఏమైనా ఉంటే హై కమాండ్‌తో మాట్లాడుకోవాలని సూచించారు. మంత్రి హరీశ్ రావును పిలిస్తే వచ్చామని మరొకరు తెలిపారు. రిపోర్టర్‌ను తీసుకొని రావడం కరెక్ట్ కాదన్నారు. పార్టీని, కేసీఆర్‌ను బదనాం చేస్తున్నారుని విరుచుకుపడ్డారు. ఏదైనా విషయం ఉంటే పార్టీ హైకమాండ్, సీఎం కేసీఆర్‌ను అడగాలని కోరారు.
టూరిజం ప్లాజాలో హైడ్రామా
జనగాం బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు రాజధానికి చేరాయి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై అసంతృప్తిగా ఉన్న నేతలు ప్రగతి భవన్‌కు అతి సమీపంలోని టూరిజం ప్లాజాలో భేటీ.
ఈ నేతలంతా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉండగా విషయం తెలిసి… pic.twitter.com/OghRpqOJmK
మీడియను పట్టుకొని.. మా కోసం 3 గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం ఏముందని ముత్తిరెడ్డిని నిలదీశారు. చివరలో హోటల్ సిబ్బంది వచ్చి గొడవ పడొద్దని కోరారు. దీంతో అంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నేరుగా ప్రగతి భవన్ వెళ్లారు.