»Brs Mlc Kalvakuntla Kavitha Fires On Cm Revanth Reddy
MLC Kavitha: సీఎం సార్ మరో సారి పునరాలోచించండి.. రాజీవ్ గాంధీ విగ్రహంపై కవిత వ్యాఖ్య
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సచివాలయంలో సీఎం రేవంత్ రాజీవ్ గాంధీ విగ్రహానికి శంకుస్థాపన చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
MLC Kavitha: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సచివాలయంలో సీఎం రేవంత్ రాజీవ్ గాంధీ విగ్రహానికి శంకుస్థాపన చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేసే కుట్ర జరుగుతుందని పేర్కొన్నారు. అయితే సచివాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ భావించారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో అమరుల త్యాగాలను స్మరించుకునేందుకు ఇప్పటికే అమరజ్యోతిని ఏర్పాటు చేశారు.
కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నెలకొల్పే పనులను ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. టెలికాం రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు దివంగత నేత విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. అదేవిధంగా దేశ సమగ్రత, సౌభ్రాతృత్వం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుడు అని కొనియాడారు. ట్యాంక్ బండ్ లో ఇప్పటి వరకు లోటు ఉండేదని, ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్ఠాపనతో పూర్తి అవుతుందన్నారు.
రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీని ఆహ్వానిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఇప్పటికే ఇందిరాగాంధీ, పీవీ నర్సింహారావు, జైపాల్ రెడ్డి విగ్రహాలు ఉన్నాయి. దీనికి తోడు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పై కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల అస్తిత్వానికి మరోసారి ముప్పు తెచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.