కుటుంబసభ్యులతో కలిసి అలిపిరి మార్గంలో తిరుమల కొండకు కాలినడకన వెళ్తున్న ఆరేళ్ళ చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతి చెందడం అత్యంత విషాదకరం. కళ్ళముందే క్రూర జంతువు కూతురిని లాక్కెళ్లిపోతే ఆ బాధ వర్ణనాతీతమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అధికారుల నిర్లక్ష్యం అని పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. వచ్చే ఉగాదికి జనసేన, టీడీపీ నామరూపం లేకుండా పోతాయన్నారు. ఆ రెండు పార్టీలు ఉంటే తాను గుండు కొట్టించుకుంటానని అన్నారు.
విశాఖలో పవన్ పర్యటిస్తున్నారు. రుషికొండను పరిశీలించేందుకు వెళ్తున్న పవన్‌కు పోలీసులు నిబంధనలతో కూడిన నోటీసులిచ్చారు. పవన్య పర్యటన సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ర్యాలీ చేపట్టారు. ఈ నేపథ్యంలో విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
సినీ నటి జయప్రదకు ఆరు నెలల జైలు శిక్షను ఎగ్మోర్ కోర్టు విధించింది. కార్మికుల చట్టం ప్రకారం ఆమెకు ఈ శిక్ష పడింది. జైలు శిక్షతో పాటుగా రూ.5 వేల జరిమానానా కోర్టు విధించింది. ఆమెతో పాటు మరో ముగ్గురికి కూడా ఈ శిక్ష పడింది.
మూడు వారాల గందరగోళం తర్వాత కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah) ఈరోజు IPC, CrPC, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో మూడు కొత్త బిల్లులను(three bills) ప్రవేశపెట్టారు. ఇవి నేరాల విషయంలో పౌరులకు కఠిన శిక్షలు వేయనున్నట్లు తెలిపారు.
నటి రేణు దేశాయ్(renu desai) వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati rambabu) తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఆ క్రంమలో ఓ ట్వీట్ చేయగా..అది చూసిన నెటిజన్లు అంబటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మంత్రిపై సంచలన కామెంట్స్ కూడా చేశారు.
మరోసారి మంత్రి అమర్నాథ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఏం అనట్లేదని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఏదైనా అంటే చిన్నాపిల్లలు మారం చేసినట్లు కేంద్రానికి చెబుతా అంటారని ఎద్దేవా చేశారు.
ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan) అన్నారు. తప్పుడు వ్యక్తులను ఎన్నుకుంటే ఐదేళ్ల పాటు ప్రజలు బాధపడాల్సి ఉంటుందని గుర్తు చేశారు.
పార్లమెంటులో రాహల్ గాంధీ(rahul gandhi) 'ఫ్లయింగ్ కిస్' ఇచ్చిన అంశంపై బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ సింగ్(neetu singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ కు అమ్మాయిల కొరత లేదని అన్నారు. ఒక వేళ ఓ యువతికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చినా అర్థం ఉంటుందని..కానీ 50 ఏళ్ల మహిళకు రాహుల్ అలా ఎలా చేస్తారని ఆమె ఎద్దేవా చేశారు.