Pawan: ఏపీ సీఎం జగన్‌పై (jagan) జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రుషికొండపై జరుగుతోన్న నిర్మాణాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వారాహి విజయయాత్రలో భాగంగా విశాఖపట్టణంలో (vizag) శుక్రవారం రుషికొండను పరిశీలించారు. ప్రభుత్వ భవనం అంటే సీఎం ఇల్లా..? ఆయనకు ఎన్ని ఇళ్లు కావాలి.? సముద్రాన్ని వీక్షిస్తూ పాలన చేయాలా..? ప్రభుత్వ భవనం సర్క్యూట్ హౌస్ తీసుకోలేకపోయారా..? దానిని తాకట్టు పెట్టి రుషికొండను కొట్టేస్తారా..? సముద్రాన్ని తిలకిస్తూ.. శాంతి వచనాలు చెబుతూ రాష్ట్రాన్ని దోచేస్తాడా అని పవన్ కల్యాణ్ (pawan kalyan) ప్రశ్నించారు.
రూల్స్ బ్రేక్
చట్టాలను కాపాడాల్సిన పాలకులే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ప్రకృతి వనరులను మింగేస్తూ.. ప్రభుత్వ ఆస్తులను కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విశాఖను (vizag) రుషికొండ కాపాడుతుంది. దశాబ్దాల నుంచి కాపాడుతున్న కొండను తవ్వడం సరికాదు. తెలంగాణలో (telangana) కూడా అలానే చేశారు.. ఇప్పుడు ఉత్తరాంధ్రపై కన్నుపడింది. ఉత్తరాంధ్ర ప్రశాంతంగా ఉండాలని చెబుతూ.. దోపిడీ చేస్తున్నారని పవన్ కల్యాణ్ (pawan kalyan) మండిపడ్డారు. రుషికొండలో జరిగే తవ్వకాలు, నిర్మాణాలకు సంబంధించి ఎన్జీటీ అనుమతి ఉందా అని పవన్ కల్యాణ్ అడిగారు. ఎన్జీటీ (ngt) వద్దని అంటోన్న.. కోర్టులు హెచ్చరిస్తోన్న జగన్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపించారు.
కండీషన్స్ అప్లై
మూడు రాజధానులు చెప్పి.. రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా జగన్ (jagan) చేశారని పవన్ కల్యాణ్ (pawan kalyan) ఆరోపించారు. కర్నూలులో జ్యుడిషీయల్ క్యాపిటల్, ఉప లోకాయుక్త అని చెప్పి.. ఆ పని చేయలేదని మండిపడ్డారు. విశాఖలో (vizag) జరిగే దోపిడీ ప్రతీ ఒక్కరికీ తెలియాలి.. అందుకోసమే రుషికొండ సమస్య, అక్రమాలను బయటకు తీసుకొస్తున్నానని పవన్ కల్యాణ్ (pawan kalyan) అన్నారు. రుషికొండ వద్దకు పవన్ కల్యాణ్ వచ్చే సందర్భంలోనూ పోలీసులు ఆంక్షలు విధించారు. మరోవైపు పవన్ కల్యాణ్‌కు (pawan kalyan) పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగిస్తున్నారనే అభియోగంపై పోలీసులు నోటీసులు జారీచేశారు. శుక్రవారం మధ్యాహ్నం విశాఖ తూర్పు ఏసీపీ మూర్తి, డీసీపీ క్రైం నాగన్న, సీఐలు కలిసి నోవాటెల్ హోటల్‌కు వచ్చి పవన్ కల్యాణ్‌కు నోటీసులు అందజేశారు. వారాహి పర్యటనకు ముందుగా 22 షరతులతో అనుమతి ఇచ్చామని తెలిపారు.