తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికపై పార్టీలు దృష్టిసారించాయి. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే ఛాన్స్ ఉండటంతో సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి.ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయం మరింత హీటేక్కింది. ప్రధాన పార్టీల నేతలు ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యర్థులను మట్టుపెట్టేందుకు నేతలు సిద్ధం అవుతున్నారు. ఓటర్లను ఆకర్షించే విధంగా ఎత్తుగడలు వేస్తున్నారు. ఇక హ్యాట్రిక్ విజయం (hat-trick win) కొట్టేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ తహతహలాడుతోంది.ఇందులో భాగంగా ముందుగానే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయ్. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల తొలి జాబితాను ఈ నెల 17న ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా ముందుగానే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయ్.
అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల తొలి జాబితాను ఈ నెల 17న ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 2018లో ముందస్తుగా ఎన్నికలకు వెళ్లి.. విపక్షాలకు ఝలక్ ఇచ్చిన సీఎం కేసీఆర్ (CMKCR).. ఈసారి కూడా అదే వ్యూహాన్ని అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం ఓవైపు నిఘా వర్గాల ఇంటలిజెన్స్ నివేదికలను తెప్పించుకుంటూనే. మరోవైపు ప్రైవేటు సర్వే సంస్థల నివేదికలను పరిగణనలోకి తీసుకుంటున్నారుఆగస్టు మూడో వారంలో గులాబి బాస్ బీఆర్ఎస్ (BRS) అభ్యర్థుల జంబో లిస్ట్ విడుదల చేస్తున్నట్లు సమాచారం. అందులో 80 శాతం సిట్టింగులకే మళ్లీ అవకాశం ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే 29 స్థానాల్లో కొత్త వాళ్లకు ఛాన్స్ ఇచ్చి, వామపక్షాలకు రెండో జాబితాలో కొన్ని సీట్లు కేటాయించే విధంగా కసరత్తు చేస్తున్నట్లు టాక్. బీఆర్ఎస్ సారథి కేసీఆర్ అభ్యర్థుల జాబితా వచ్చే వారంలో (ఈ నెల 17 లేదా 19) తేదీల్లో 90 మందితో కూడిన తొలి జాబితాను ప్రకటిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇందులో ఒకరు ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రి ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఆ మంత్రికి సంబంధించిన అభ్యర్థిత్వంపై ఎన్నిసార్లు సర్వేలు జరిపించినా.. నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించినా.. ప్రతికూల నివేదికలు వచ్చాయని తెలుస్తోంది. దీంతో ఆ మంత్రి నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉన్న విపక్ష పార్టీ నాయకుడిని… బీఆర్ఎస్లోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మంత్రిని ఇబ్బంది పెట్టకుండా లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha election) పోటీ- చేయించడమా లేదా ఎమ్మెల్సీగా అవకాశమివ్వడమో చేయాలన్న ప్రతిపాదన కేసీఆర్ పరిశీలనలో ఉన్నారని తెలుస్తోంది.ఇప్పటికే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈసీ షెడ్యుల్ ప్రకటించడమే ఆలస్యం వెంటనే లిస్ట్‌ను రిలీజ్ చేసేందుకు హస్తం పార్టీ హైకమాండ్ (High Command) రంగం సిద్ధం చేస్తోంది. సగానికి పైగా స్థానాల్లో స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థులను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. 50 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.