Mysterious creature: 20 చేతులతో ఉన్న వింత జీవి..ఫొటో వైరల్
20 చేతులతో ఉన్న ఓ వింత జీవిని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటార్కిటిక్ సముద్రంలో 6500 అడుగుల లోతులో ఈ వింత జీవిని గుర్తించినట్లు పరిశోధకులు చెబుతున్నారు.
అంటార్కిటిక్ సముద్రం (Antarctic Ocean)లో వింత జీవిని గుర్తించారు. ఆ వింత జీవి స్ట్రాబెర్రీ (Strawberry) ఆకారంలో ఉంది. దాని దేహం చుట్టూ కూడా చేతుల్లాగా 20 శాఖలు (20 Hands) ఉన్నాయి. ఈ మధ్యనే సముద్రపు జీవుల పరిశోధన కోసం శాస్త్రవేత్తలు ఓడలో వెళ్లారు. ఆ సమయంలోనే వారు ఆ విశిష్ట ఆకారంలో ఉన్న జీవిని గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.
20 చేతులతో ఉన్న ఆ జీవికి శాస్త్రీయంగా ‘ప్రోమాకోక్రినస్ ఫ్రగారియస్’ అని నామకరణం చేశారు. దాంతో పాటుగా ‘అంటార్కిటిక్ స్ట్రాబెర్రీ ఫెదర్ స్టార్’ అనే సాధారణ పేరును కూడా పెట్టడం విశేషం. స్ట్రాబెర్రీ ఆకారంలోని ఆ జీవి ఇరవై శాఖలతో తన దేహాన్ని కలిగి ఉంది. అందుకే దానికి ఆ పేరు పెట్టినట్లుగా శాస్త్రవేత్తలు (scientists) వెల్లడించారు.
ఇటువంటి వింత జీవులన్నీ (Mysterious creature) కూడా అంటార్కిటిక్ సముద్రంలో ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. సముద్రంలో 65 అడుగుల నుంచి 6,500 అడుగుల లోతులో ఈ జీవులు నివశిస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా కనిపించిన వింత జీవికి 20 చేతుల్లో కూడా రెండు రకాలు ఉన్నట్లు తెలిపారు. ఆ జీవికి లోపలి వైపు ఉన్న శాఖలు చాలా రఫ్‌గా బలంగా ఉన్నాయని చెప్పారు. అయితే బయటి వైపు శాఖలు చాలా సన్నగాను, ఈకల్లాగా ఉన్నట్లు సైంటిస్టులు (scientists) వెల్లడించారు.