నటి రేణు దేశాయ్(renu desai) వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati rambabu) తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఆ క్రంమలో ఓ ట్వీట్ చేయగా..అది చూసిన నెటిజన్లు అంబటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మంత్రిపై సంచలన కామెంట్స్ కూడా చేశారు.
Ambati rambabu tweet on Renus comments Netizens are react and comment to minister ambati
ఇటీవల విడుదలైన ‘బ్రో’ సినిమాలో శ్యాంబాబు పాత్ర వివాదాస్పదమైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీనిపై నటి, దర్శకురాలు రేణు దేశాయ్ గురువారం స్పందించారు. తన మాజీ భర్త, అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అయితే దానిని చూసిన ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati rambabu) కౌంటర్ ఇచ్చారు. ‘అమ్మా రేణూ! మీ మాజీతో చెప్పండి.. మాలాంటి క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని అంటూ ట్వీట్ చేస్తూ పేర్కొన్నారు.
మరోవైపు ఈ ట్వీట్ చూసిన పలువురు ఏపీలో ఒక మంత్రి హోదాలో ఉండి ప్రజా సమస్యలపై స్పందించకుండా ఇలా చిన్న విషయానికి నానా రచ్చ చేస్తున్నారని అంబటి రాంబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్(comments) చేశారు. మరోవ్యక్తి అయితే మంత్రి గారు ముందు మీరు మీ ఇంట్లో భార్యతో కాపురం చేయాలని..సంజన, సుకన్య అంటూ గ్రామాల మీద సింహం మాదిరిగా తిరగొద్దని పేర్కొన్నారు. అంతేకాదు మీకు మంచి సినిమాలు నచ్చవని ఆర్జీవీ తీసే పోర్న్ సినిమాలే మీకు నచ్చుతాయని నెటిజన్ కౌంటర్ ఇచ్చారు. ఇంకా పలువురు ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈట్వీట్ క్లిక్ చేయండి.
అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని !
అయితే రేణు దేశాయ్(renu desai) ఏమన్నారంటే “ఇటీవల విడుదలైన ఓ సినిమాలోని సన్నివేశాలు వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆ వివాదం గురించి నాకు పెద్దగా తెలియదు. కాకపోతే పవన్ పై సినిమా, వెబ్ సిరీస్ తీస్తామని ఇటీవల కొందరు చెప్పారు. పెళ్లిళ్లు, భార్యాపిల్లలు, పిల్లల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిపారు. ఒక తల్లిగా నా వ్యక్తిగత అభ్యర్థన కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దయచేసి పిల్లలను అందులోకి లాగకండి. మా పిల్లలు సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో పుడతారు. నా పిల్లల తండ్రి నటుడు, రాజకీయ నాయకుడు. నా పిల్లలే కాదు, పిల్లలను, మహిళలను రాజకీయాల్లోకి లాగొద్దు. రాజకీయంగా ఏమైనా ఉంటే మీరే చూసుకోండని ఆమె విజ్ఞప్తి చేశారు.
పవన్ కళ్యాణ్, మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో(BRO) చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. ఇందులో శ్యాంబాబు పాత్రలో నటుడు పృథ్వీరాజ్ నటించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక సినిమాల్లో తన క్యారెక్టర్‌ను పెట్టి ఎంజాయ్ చేస్తున్నాడని మంత్రి అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలపై స్పందించిన పృథ్వీరాజ్.. ఎవరినీ అనుకరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.