»Will Rahu Give A Flying Kiss To A 50 Year Old Woman Bihar Mla Neetu Singh
Neetu singh: రాహుల్ 50 ఏళ్ల మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇస్తారా?
పార్లమెంటులో రాహల్ గాంధీ(rahul gandhi) 'ఫ్లయింగ్ కిస్' ఇచ్చిన అంశంపై బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ సింగ్(neetu singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ కు అమ్మాయిల కొరత లేదని అన్నారు. ఒక వేళ ఓ యువతికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చినా అర్థం ఉంటుందని..కానీ 50 ఏళ్ల మహిళకు రాహుల్ అలా ఎలా చేస్తారని ఆమె ఎద్దేవా చేశారు.
Will Rahu give a flying kiss to a 50 year old woman bihar mla neetu singh
లోక్‌సభలో రాహుల్ గాంధీ(rahul gandhi) తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత మహిళా పార్లమెంటులో ‘ఫ్లయింగ్ కిస్(flying kiss)’ ఇచ్చారన్న వివాదంపై బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ సింగ్(neetu singh) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీని సమర్థిస్తూ మాట్లాడారు. “రాహుల్ కు మహిళలకు కొరత లేదని, అతను ఎందుకు అలా చేస్తాడని..అది కూడా 50 ఏళ్ల మహిళకు ముద్దు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. రాహుల్ గాంధీకి ఆడవాళ్ల కొరత లేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ ఫ్లయింగ్ కిస్ ఇవ్వాల్సి వస్తే.. ఓ యువతికి ఇస్తారు. కానీ ఓ వృద్ధురాలికి ఫ్లై కిస్ ఇస్తారా అంటూ ఎద్దేవా చేశారు. ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవి ఆమె ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా పేర్కొన్నారు. అయితే నీతూ సింగ్ ప్రకటనపై అధికార బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. నీతూ వ్యాఖ్యలు సిగ్గు చేటని బీజేపీ నేతలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
If Rahul Gandhi wants to give flying kiss he has many women available
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) August 10, 2023
రాహుల్ గాంధీ(rahul gandhi) అసభ్యకరంగా ప్రవర్తించారని ఇది సభలో మహిళా సభ్యుల గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా ఈ సభా గౌరవాన్ని దిగజార్చిందని లోక్‌సభ స్పీకర్‌కు చేసిన ఫిర్యాదులో మహిళా ఎంపీలు పేర్కొన్నారు. 20 మందికి పైగా మహిళా ఎంపీల సమక్షంలో రాహుల్ గాంధీ బుధవారం పార్లమెంటులో ముద్దు పెట్టడం ద్వారా దిగువ సభలో గందరగోళం సృష్టించారని వారు సంతకం చేసి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ పంపారు. బిజెపి ఎంపి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అతన్ని మహిళా ద్వేషి అని ఆరోపించారు. ఇటువంటి “అసభ్యకరమైన చర్య” సభ ఎప్పుడూ చూడలేదని ఆమె అన్నారు. వాయనాడ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇతర BJP నాయకులు కూడా ఈ చర్య సిసిటివి ఫుటేజీని పంచుకున్నారు. అయితే రాహుల్ గాంధీ నిజంగా హౌస్ లోపల ఫ్లయింగ్ కిస్‌ను ఇచ్చారా అనేది నిర్ధారించబడలేదు. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) ఎంపీ ప్రియాంక చతుర్వేదికి ఆప్యాయతతో కూడిన సంజ్ఞ చేశారని అంటున్నారు. కానీ మహిళా పార్లమెంటేరియన్లను మాత్రమే లక్ష్యంగా చేసుకోలేదని చెబుతున్నారు.