»Jahnavi Yadu Teacher In School Uniform Is A New Way Of Teaching With The Children Of Chhattisgarh
School teacher: పిల్లల మాదిరిగా యూనిఫాం ధరించి పాఠాలు చెబుతున్న టీచర్
ఉపాధ్యాయులకు బయపడి స్కూళ్లకు వెళ్లని విద్యార్థులు చాలా మంది ఉంటారు. కొంత మంది పిల్లలకు మాములుగానే బడి అంటే భయం ఉంటుంది. దానికి తోడు టీచర్ల భయం కూడా..ఈ నేపథ్యంలో ఓ టీచర్ ఓ స్కూల్లో విద్యార్థులకు వారి మాదిరిగా యూనిఫాం ధరించి పాఠాలు బోధిస్తున్నారు. అది పలువురిని ఆకర్షిస్తుంది.
Teaching: చిన్నపిల్లలు పాఠశాలల(School)కు వెళ్లాలంటే భయపడుతుంటారు. కారణం ఏదైనా కావచ్చు. టీచర్(Teacher) అంటే భయపడి కూడా చాలా మంది వెళ్లడానికి ఇష్టపడరు. అయితే పిల్లల(Students)ను దారిలో పెట్టేందుకు ఓ ఉపాధ్యాయురాలు వినుత్నంగా ఆలోచించింది. తాను కూడా యూనిఫామ్(Uniform) ధరించి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. పిల్లల్ని ఆకట్టుకునేలా బోధనలు చేస్తున్నారు. ఆడుతూ, పాడుతూ నేర్పిస్తూ.. చదువుల పట్ల వారిలో ఆసక్తిని పెంచుతున్నారు. ఛత్తీస్గడ్(Chhattisgarh)కు చెందిన టీచర్ జాహ్నవి యదు(Jahnavi Yadu) విద్యార్థులతో స్నేహంగా ఉంటూ విద్యార్థులను స్కూల్‌కు వచ్చేలా ప్రోత్సహిస్తున్నారు.
రాయ్‌పుర్ జిల్లాలోని రాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జాహ్నవి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కేవలం పాఠాలు మాత్రమే కాదు. పిల్లలను ఫ్రెండ్స్‌లా చూసుకుంటారు. వాళ్లలో ఒకరిగా కలిపోతారు. అందుకే పిల్లలకు జాహ్నవి అంటే అమితమైన ప్రేమ. నవ్విస్తూ పాటాలు చెబుతుంది. కాబట్టి పిల్లల అటెన్షన్, అటెండెన్స్ రెండూ ఉంటాయి. అందుకే వారు తమ వ్యక్తిగత విషయాలను కూడా తనతో చెప్పుకుంటారు. స్కూల్ డ్రెస్ ధరించడం పట్ల పలువురు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనకు పాఠశాలతో చిన్నప్పటి నుంచి అనుబంధం ఉందని, తనకు ఎలాంటి మొహమాటం లేదని ఆమె చెబుతున్నారు.
అయితే మొదట్లో పిల్లలు కొంచెం అపరిశుభ్రంగా వచ్చేవారని, షర్ట్ బటన్స్ కూడా సరిగ్గా పెట్టుకొని వచ్చేవారు కాదని, ఇక పూర్తి యూనిఫామ్ కూడా ఉండేది కాదని అందుకే తాను కూడా వాళ్లలా స్కూల్ యూనిఫామ్‌తో రోజు వస్తుంటే పిల్లలు శ్రద్ధగా పాఠాలు వింటున్నారని, పాఠశాలకు కూడా క్రమం తప్పకుండా వస్తున్నట్లు జాహ్నవి యదు అంటున్నారు. అంతేకాదు ఏదైనా డౌట్ ఉన్నా సరే వెంటనే లేచి అడుగుతున్నారని చెబుతుంది. ఈ విధంగా వారిలో ఆసక్తిని నింపుతూ పాఠాలు చెబుతున్న జాహ్నవిని స్థానికులు, తోటి అధ్యపకులు ప్రశంసిస్తున్నారు.