CM Jagan: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై ఏపీ సీఎం జగన్ (CM Jagan) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో టీడీపీని జనాలు విశ్వసించడం లేదన్నారు. అందుకే రెచ్చగొట్టి ఘర్షణలు జరిగేలా చేస్తున్నారని మండిపడ్డారు. అంగళ్లు, పుంగనూరు ఘటనలను సీఎం జగన్ (CM Jagan) ఉదహరించారు. అంగళ్లులో చంద్రబాబు స్వయంగా రెచ్చగొట్టి గొడవ చేయించాడని ఆరోపించారు. అతని తీరు చూస్తే తనకు బాధ వేస్తుందని జగన్ (Jagan) అంటున్నారు.
పుంగనూరులో చంద్రబాబు పర్మిషన్ తీసుకున్న రూట్లో కాకుండా మరో రూట్లోకి ఎందుకు వచ్చారని సీఎం జగన్ (CM Jagan) ప్రశ్నించారు. శాంతి భద్రతల సమస్య వస్తుందని చెబితే ఇష్టానుసారంగా మాట్లాడారని గుర్తుచేశారు. 47 మంది పోలీసులను గాయపరిచేలా కార్యకర్తలతో దాడులు చేయించారని తెలిపారు. గొడవలో ఓ పోలీస్ కన్ను కూడా పోగొట్టుకున్నాడని వివరించారు. చంద్రబాబు తీరు మారడం లేదని విరుచుకుపడ్డారు.
చదవండి: High Court: వరద నష్టం రూ.500 కోట్లు ఎలా ఖర్చు చేశారు.. హైకోర్టు ఆగ్రహాం
గొడవ జరగాలి.. శవ రాజకీయాలు చేయాలి అన్నట్టు ఆయన వైఖరి ఉందన్నారు. తనకు అనుకూలంగా ఉన్న మీడియాతో వార్త కథనాలు రాయించుకుంటున్నారని వివరించారు. దీంతో తాము ఏం చేసినా చెల్లుతుందనే భావనలో ఉన్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆయనకు ఎల్లో మీడియా…అలాగే దత్తపుత్రుడు కూడా తోడుగా ఉన్నాడని మండిపడ్డారు. చివరకు శవ రాజకీయాలకు కూడా వెనకాడటం లేదని పేర్కొన్నారు.
ఇటీవల పుంగనూరు, అంగళ్లులో ఘర్షణలు జరిగాయి. ఆ ఇన్సిడెంట్ల గురించి సీఎం జగన్ (CM Jagan) ప్రస్తావించారు. ప్రజల నుంచి ఆదరణ రావడం లేదని చంద్రబాబు చీఫ్ ట్రిక్స్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. జనాల విశ్వాసాన్ని కోల్పోయారని.. ఇదీ ఆయనకు కూడా తెలుసు అని చెబుతున్నారు.