ఎన్నికల్లో గెలవడానికి గతంలో ఇచ్చిన హామీలు ఇంకా పూర్తి చేయకముందే..మళ్లీ కొత్తవి ప్రకటిస్తున్నారు. కొత్త హామీలను చూసి ప్రజలు ఆశపడి ఓటేసి భంగపడడం పరిపాటి అయిపోయింది. అలాగే గృహలక్ష్మీ కూడా మరో దలితబంధు కాబోతుందా అనే అనుమానాలకు తావిస్తోంది. ఆ వివరెలెంటో ఇప్పుడు చుద్దాం.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనకు ఉన్న క్రేజ్ కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం కాకుండా ప్రస్తుతం సౌత్లో ప్రజల్లో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అతను యూపీలో అవినీతి, అక్రమార్కుల పట్ల చేస్తున్న కృషితోపాటు విద్య, వైద్యానికి ఆదిత్యనాథ్ చేస్తున్న కృషిని అనేక మంది ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన గురించి వచ్చిన అజయ్ టు యోగి ఆదిత్యనాథ్ పుస్తకాల...
కేసీఆర్, కేటీఆర్‌లపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము లేకపోతే ఇద్దరు నాంపల్లి దర్గా దగ్గరనో, బిర్లా టెంపుల్ దగ్గరనో లేదా ఆదివారం మెదక్ చర్చి వద్దనో అడుక్కుతినే వారని అన్నారు.
మంత్రి కేటీఆర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు తాను ఎప్పుడూ మందు పోయలే, పైసలు పంచలేదని తెలిపారు. ప్రజల దయ ఉంటే మళ్లీ గెలుస్తానని చెబుతున్నారు.
ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలు చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇక సినిమాలతో పాటు రాజకీయంగాను ఫుల్ బిజీగా ఉన్నాడు పవర్ స్టార్. దీంతో పవన్ పై రాజకీయ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో కొడాలి నానికి వార్నింగ్ ఇస్తున్నారు పవన్ ఫ్యాన్స్.
దేశ రాజధాని బ్యూరోక్రసీపై కేంద్రానికి నియంత్రణ కల్పించే ‘ఢిల్లీ సేవల బిల్లు’ పార్లమెంటు ఆమోదం పొందిన ఒక రోజు తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
వాల్తేరు వీరయ్య 200 ఆడిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో చిరంజీవి స్పందిస్తూ ఏపీ రాజకీయాలపై కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితిల్లో 200 డేస్ ఒక సినిమా ఆడటం అంటే మాములు విషయం కాదంటునే.. ఏపీ పాలకులు ప్రజల ఉపాధి, ప్రత్యేక హోదా గురించి పోరాడితే బాగుంటుందని సినిమా పరిశ్రమపై పడడం దేనికి అని చురకలు పెట్టారు.
బీఆర్ఎస్ భవన్‌లో మహారాష్ట్ర నేతలతో కేసీఆర్(KCR) సమావేశం సందర్భంగా ఆ రాష్ట్ర అభివృద్దిపై ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణతో పొలిస్తే మహారాష్ట్రా వెనకబడింది అన్నారు. ఈ మాటలపై ప్రతిపక్షాలు విమర్షలు గుప్పిస్తున్నారు. ముందు తెలంగాణలో జరిగిన అభివృద్ధి పనులేంటో చెప్పమని నిలదీస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వంపై..ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం(No confidence motion) ఎందుకు ప్రవేశపెట్టింది? అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా ఇండియా కూటమి ఏం సాధిద్దామని అనుకుంటుంది? పార్లమెంట్‌లో జరిగే చర్చలో ఎటువంటి వ్యూహంతో వ్యవహరించనుంది? లోక్‌సభ సభ్యత్వం తిరిగి పొందిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ చర్చలో బీజేపీపై విరుచుకపడనున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఎన్టీరామారావుకే వెన్నుపోటు పొడిసిన ఘనత చంద్రబాబుకు ఉందని, అతను ఎవరినైనా అవసరాలకు వాడుకొని పక్కన పెడతాడని కొడాలి నాని పేర్కొన్నారు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ మార్పు తీసుకొస్తామంటే స్వాగతిస్తామన్న నాని చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే బట్టలు ఊడదీసి రోడ్డుమీద నిలబెడుతామని అన్నారు.
టీటీడీ చైర్మన్ నియామకం వివాదాస్పదమైంది. భూమన కరుణాకర్ రెడ్డి అన్యమతస్తుడు అని.. ఆయనను చైర్మన్ పదవీ నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హిందూ సంస్థలు, భక్తులు కోరుతున్నారు.