అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొందరు బాధితులు మీడియా ముందుకు వచ్చారు. ఆడియో రిలీజ్ చేసి, తమ ఇబ్బందిని వివరించారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ.. ఎమ్మెల్యేల రాసలీలల అంశం అధికార పార్టీకి ఇబ్బందిగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వేధింపులు ఎక్కువ అయ్యాయని ఫ్యాషన్ డిజైనర్ శోభారాణి అంటున్నారు. పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని.. తనకు ఆత్మహత్య శరణ్యం అంటున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్(pawankalyan) వారాహి మూడో విడత యాత్ర షెడ్యూల్ కు ముహూర్తం ఫిక్సైంది. ఈ యాత్ర విశాఖ జిల్లాలో ఆగస్టు 10 నుంచి ప్రారంభం కానుంది. జనసేన నాయకత్వం ఈ మేరకు నిర్ణయించింది. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ విశాఖ జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. మూడో విడత యాత్ర జరిగేది విశాఖ జిల్లాలో అని క్లారిటీ ఇచ్చారు. దీంతో విశాఖ జనసైనికులలో జోష్ నెలకొంది.
ప్రతిపక్షాల 'ఇండియా' కూటమిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah) వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(mamata banerjee) కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. తమ కూటమి దేశానికి అనుకూలంగా ఉందని ఆమె అన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎన్నికల స్టంటే అన్నారు మంత్రి మల్లారెడ్డి. అంతేకాదు తన ఇంట్లో డబ్బులు ఉన్న గదిని ఐటీ అధికారులు చూడలేదని, వాటినే వచ్చే ఎన్నికల్లో ఖర్చు చేస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ దోపిడీ పాలనకు అడ్డు అదుపు లేకుండా తయారైందని ఆరోపించారు.