అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొందరు బాధితులు మీడియా ముందుకు వచ్చారు. ఆడియో రిలీజ్ చేసి, తమ ఇబ్బందిని వివరించారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ.. ఎమ్మెల్యేల రాసలీలల అంశం అధికార పార్టీకి ఇబ్బందిగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
BRS: బీఆర్ఎస్ నేతలపై (brs leaders) వరసగా లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. బాధిత మహిళలు మీడియా ముందుకు వస్తున్నారు. కొద్దీ నెలల్లో ఎన్నికలు ఉండగా.. ఎమ్మెల్యేలపై ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీకి (brs party) నెగిటివ్ అవుతోంది. ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు రావడం.. బాధిత మహిళలు ఆందోళన చేయడంతో చర్చకు దారితీసింది. తమకు న్యాయం చేయాలని బాధిత మహిళలు ఢిల్లీలో కూడా నిరసనకు దిగారు.
బాలికను లాక్కెళ్లి
నిజామాబాద్ జిల్లా బోదన్ పట్టణంలో ఓ 13 ఏళ్ల బాలికపై ఇటివల బీఆర్ఎస్ నేత సోదరుడు రవీందర్ అత్యాచారం చేశారు. రోడ్డుపై వెళుతున్న బాలికను లాక్కెళ్లి మరి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన అక్కడి ఎమ్మెల్యే షకీల్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు. మరోవైపు బాధిత కుటుంబానికి ఎలాంటి న్యాయం చేశారనే విషయం కూడా తెలియలేదు.
నవ్య వ్యథ
మనం చెప్పుకున్న ఎమ్మెల్యేల్లో ముందుకు ప్రస్తావించాల్సింది స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య (rajaiah) గురించే. నియోజకవర్గంలోని జానకీపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్య ఆయనపై కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే వేధించాడని మీడియా ముందుకు వచ్చారు. గ్రామాభివృద్ధికి రూ.20 లక్షలు ఇస్తానని ఇవ్వలేదని.. తర్వాత రూ.20 లక్షలు తీసుకున్నట్టు బాండ్ పేపర్‌పై సంతకం పెట్టాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. ఓ మహిళ ద్వారా తన భర్తను ట్రాప్ చేశారని తెలిపారు. ఎమ్మెల్యే రాజయ్య (rajaiah) వల్ల తనకు, తన భర్తకు ప్రాణహానీ ఉందని చెప్పారు. అంతకుముందు తనను బెదిరించిన ఆడియోలను నవ్య విడుదల చేశారు. ఇవే కాదు ఎమ్మెల్యే రాజయ్యపై (rajaiah) చాలా ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది నవ్య మాదిరిగా ఆరోపణలు చేశారు. ఆ మధ్యలో ఓ మహిళా ఆడియో కూడా వచ్చింది. డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో వేధింపులు ఎక్కువగా ఉండేవని తెలిసింది.. ఆ సమయంలో సహచర సభ్యురాలిపై తప్పుగా ప్రవర్తించారని సమాచారం. అందుకోసమే పదవీ ఊడిందని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. మరోవైపు ఘనపూర్ సీటు విషయంలో కడియం శ్రీహరితో (srihari) గొడవ ఉంది. ఇటీవల కూడా ఇద్దరు నేతలు మీడియా ముందుకు రాగా.. కేటీఆర్ రంగంలోకి దిగడంతో గొడవ సద్దుమణిగింది.
షెజల్ కథ
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై (chinnaiah) ఆరిజన్ డైరీ నిర్వాహకురాలు షెజల్ రోడ్డుకెక్కారు. ఈమె బెల్లంపల్లి, హైదరాబాద్‌లో కాక ఢిల్లీ గల్లీలో నిరసనకు దిగారు. సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. బెల్లంపల్లి (bellampally) నియోజకవర్గంలో ఆరిజన్ డైరీ ఏర్పాటు చేసే విషయంలో షెజల్ (shejal)- చిన్నయ్య మధ్య చర్చలు జరిగాయి. ప్రభుత్వ భూమి ఇచ్చి రూ.10 లక్షలను చిన్నయ్య తీసుకున్నాడని షెజల్ ఆరోపించారు. తర్వాత ఖాళీ చేయాలని అధికారులతో ఒత్తిడి తెచ్చాడని చెప్పారు. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోగా.. తమను ఖాళీ చేయమనడంతో ఎక్కడికి వెళ్లాలని వాపోయారు. తానే కాదు.. అమ్మాయిలను కూడా ఎమ్మెల్యే చిన్నయ్యకు సప్లై చేశానని షెజల్ తెలిపారు. చిన్నయ్యపై (chinnaiah) చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని.. సీఎం కేసీఆర్‌ను పలుమార్లు కోరారు. ఢిల్లీలో సూసైడ్ అటెంప్ట్ చేసిన షెజల్.. తర్వాత ప్రగతి భవన్ ముందు కూడా పోస్టర్లు పట్టుకొని నిరసన చెపట్టారు. దుర్గం చిన్నయ్య వేధింపుల నుంచి తనను కాపాడాలని కోరారు. మంత్రి కేటీఆర్‌కు కూడా పలుమార్లు విన్నవించారు. తన సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు.
గండ్ర ఇలా
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై (gandra venkataramana reddy) కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. విజయలక్ష్మీ రెడ్డి అనే మహిళ మీడియా ముందుకు వచ్చింది. తాను సామాజిక కార్యకర్తను అని.. 2014లో తమకు పరిచయం అని.. తర్వాత వివాహేతర సంబంధం కొనసాగిందని తెలిపారు. ఆ తర్వాత తనను వదిలేయాలని అంటున్నారని పేర్కొంది. వినడం లేదని, చంపేస్తానని అన్నారని హాట్ కామెంట్స్ చేశారు. అప్పట్లో గండ్ర ఇంటి ముందు విజయలక్ష్మీ (vijaya laxmi) ఆందోళనకు దిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
మరో ఇద్దరు
వీరే కాదు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (madhavaram krishna rao) కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు. మంథని ఎమ్మెల్యే పుట్టా మధుపై (putta madhu) లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల గురించి బాధిత మహిళలు మీడియా ముందుకు వచ్చి నిరసన తెలిపారు.
అయితే అసలు వెలుగులోకి వచ్చిన ఘటనలో ఇన్ని ఉంటే ఇంకా మీడియా ముందుకు రానివి ఎన్ని ఉన్నాయోనని పలువురు అంటున్నారు. అంతేకాదు ప్రతి జిల్లాలో కూడా BRS నేతల ఆగడాలు, అరాచకాలు, భూముల కబ్జాలు పెరిగిపోయాయని ఇంకొంత మంది కామెంట్లు చేస్తున్నారు.