అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగుళ్లు (Angullu) లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాజెక్టు బాటను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించాయి. టీడీపీ (TDP) బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చింపివేశారు. దీంతో రెండు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది.ఈ ఘర్షణలో మదనపల్లె మండలం కొత్తపల్లి ఎంపీటీసీ దేవేంద్ర, ఇతర టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. జెండాలను గాల్లో తిప్పుతూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేందుకు వైసీపీ శ్రేణులు యత్నించినట్టు టీడీపీ నేతలు ఆరోపించారు.
ఈ సందర్భంగా టీడీపీ వర్గీయులపై వైసీపీ (YCP) శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడికి దిగింది. అంగళ్లు సెంటర్ వద్దకు ఇరువర్గాలు చేరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించకుండా, చోద్యం చూస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు.ఆ ప్రాంతంలో ఓ రావణాసురుడు ఉన్నాడని, ఇక్కడి రావణాసురుడికి ట్యాగ్ ఎమ్మెల్యే అని చంద్రబాబు (Chandrababu) అన్నారు.
పోలీసులపై చంద్రబాబు మండిపడ్డారు. కాగా, తంబళ్లపల్లె (Thamballapalle) నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించి పలువురితో మాట్లాడారు. నాయిని చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను చంద్రబాబు పరిశీలించారు.చంద్రబాబు పులివెందుల టూర్ భారీ సక్సెస్ కావడంతోనే, పుంగనూరులో సైకో గ్యాంగ్ ని రంగంలోకి దింపారంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది. చంద్రబాబుపై దాడి చేయడానికి పెద్దిరెడ్డి అండ్ తాడేపల్లి(Tadepalli)సైకో బ్యాచ్ ప్లాన్ వేసుకుని, ఆ ప్రయత్నాలు చేశారని అంటోంది.