హైదరాబాద్(hyderabad) ప్రజలకు త్వరలో గుడ్ న్యూస్ రాబోతోంది. ఎందుకంటే ఇప్పటికే మెట్రో ట్రైన్ ప్రాజెక్టుతో బిజీగా మారిన ఈ నగరానికి బుల్లెట్ ట్రైన్(Bullet train) కూడా రానుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఆ దిశగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరులను కనెక్ట్ చేస్తు ఏర్పాటు చేసేందుకు అంచనా వేస్తున్నట్లు వెల్లిడించారు.
హర్యానాలోని నుహ్(Nuh district)లో సోమవారం సాయంత్రం జరిగిన మతపరమైన ఊరేగింపులో దుండగుల వర్గాలు(Haryana Violence) రాళ్లు రువ్వుకున్నాయి. ఈ క్రమంలో పలువురు కార్లకు నిప్పంటించడంతో 50 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మరణించిన వారి సంఖ్య మంగళవారం ఉదయం నాటికి ఐదుకు చేరుకుందని పోలీసులు పేర్కొన్నారు.
ప్రస్తుత కాలంలో ఏ రాష్ట్రంలో చూసినా ప్రేమ వివాహాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో అనేక మంది పేరెంట్స్ అలాంటి పెళ్లిళ్లను అంగీకరించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో తమ రాష్ట్రంలో ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయాలని భావిస్తున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే, మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్(srinivas goud)పై కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. ఎన్నికల అఫిడవిట్ విషయంలో ట్యాంపరింగ్ కు పాల్పడ్డారని తెలిపింది.
పాకిస్థాన్ వెళ్లి, నస్రుల్లాను పెళ్లి చేసుకున్న అంజూ వ్యవహారం అంతర్జాతీయ కుట్ర అని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉన్న 900 కోట్ల రూపాయల రాష్ట్ర విపత్తు సహాయ నిధిని వినియోగించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఈ నిధుల్లో కేంద్ర ప్రభుత్వ వాటానే 75 శాతం ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో గల్లంతైన బాధితుల కుటుంబాలకు రూ.4 లక్షలు అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు.