ఏపీలో పవన్ కళ్యాణ్ వలన మిస్ అయిన అమ్మాయిలు ఎంతమందో లెక్క తేలాలన్నారు మంత్రి రోజా. చంద్రబాబు నిజమైన రాయలసీమ ద్రోహి అని, గంజాయి, ఎర్రచందనం నారావారిపల్లిలో దొరుకుతాయని ఎద్దేవా చేశారు.
నగరం నీట మునగడంపై అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఎన్ఎస్‌యూఐ.. జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఇదేనా డల్లాస్ అని ప్రశ్నించగా జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ సీరియస్ గా వెళ్లిపోయారు.
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లతోపాటు ఆయా బాధితులకు 25 కిలోల బియ్యం, ఉల్లిగడ్డ, బంగాళదుంపలు, కిలో పామాయిల్ నూనె సహా తదితర వస్తువులు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. దీంతోపాటు ఇళ్లు దెబ్బతిన్న వారికి కూడా ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఖర్చు, చూపిస్తున్న లెక్కలకు సంబంధం లేదని ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపిచారు. అంతేకాదు రాష్ట్రంలో ఏ ఒక్క రైతైనా మంచిగా ఉన్నారా అంటూ ప్రశ్నించారు.
ఓ సూక్ష్మ చిత్ర కళాకారుడు తమ అభిమాన నాయకుడు చంద్రబాబు ఫోటోను గుమ్మడి గింజపై చెక్కాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వనమా వెంకటేశ్వరరావు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన ఎన్నిక చెల్లదనే తీర్పుపై స్టే ఇవ్వాలని.. సుప్రీంకోర్టులో వెళ్లేందుకు సమయం ఇవ్వాలని కోరారు.