JC Prabhakar Reddy: తాడిపత్రి తమకు ఇల్లు వంటిదని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) అన్నారు. మున్సిపల్ కమిషనర్ వ్యవహార శైలిని నిరసిస్తూ గురువారం టీడీపీ కౌన్సిలర్లతో కలిసి ఆందోళన చేపట్టారు. కమిషనర్ ప్రోటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. తన తండ్రి హయాం నుంచే తాడిపత్రికి తమ కుటుంబానికి అనుబంధం ఉందని చెప్పారు. ఒకప్పుడు తాడిపత్రి నంబర్ వన్ మున్సిపాలిటీ అని గుర్తుచేశారు. ఇప్పుడు పరిస్థితి దిగజారిందని వివరించారు.
మున్సిపాలిటీ అంతా సెంట్రల్ ఏసీ అని.. చివరికీ బాత్రూం అని జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) తెలిపారు. ఇప్పుడు పరిస్థితి మారిందని వివరించారు. ఇలాంటి పరిస్థితులు చూడలేక ఆందోళనకు దిగాల్సి వస్తోందన్నారు. తనకు ప్రోటోకాల్‌తో పని లేదని.. తనను ఎక్కడికి వెళ్లినా గుర్తిస్తారని చెప్పారు. వివిధ అంశాలు పరిష్కారం కావడం లేదని పోరాటం చేస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీ ఆర్థికంగా నష్టం జరుగుతుందన్నారు.
ఇంతకుముందు ఓ పోలీస్ అధికారి ఉండేవాడు.. చెత్తబండి తీసుకెళితే హౌస్ అరెస్ట్ అనేవాడు. ఇప్పుడు ఇక్కడ లేడు. ఉన్న పోలీసులు ఆలోచించేవారు. వారి వల్ల తాను స్వేచ్ఛగా ధర్నా చేయగలుగుతున్నా అని చెప్పారు. తన బస్సుల వ్యాపారం, ఇతర ఏమైనా కానీ.. తనను పెంచి పోషించిన తాడిపత్రి కోసం కొట్లాడతానని అంటున్నారు. అవసరమైతే ప్రాణాలు ఇస్తానని పేర్కొన్నారు. హైటెక్ సిటీలో ఉండే సౌకర్యాలతో కూడిన ఏసీ మున్సిపాలిటీ అని.. అదే ప్రమాణాలతో కొనసాగించాలని కోరుతున్నాం అని తెలిపారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మరో 9 నెలలు ఉంటుంది.. తాను 72 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నానని తెలిపారు. ఇకముందు ఉంటాను. అధికారం లేకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి ఉండమనండి అని అడిగారు. కేతిరెడ్డి హర్ష చిన్న పిల్లవాడు, ఆయనకేం తెలుసు.. ఓ వార్డు కౌన్సిలర్ కాబట్టి ఇక్కడి వచ్చి ఉంటాడని వివరించారు.