Indoor Plants For Home Cooling : వేసవి కాలంలో బయట వాతావరణం వేడిగా ఉన్నట్లే, ఇంటి లోపల గదుల్లో వాతావరణమూ వేడి వేడిగానే ఉంటుంది. అయితే కొన్ని ఇండోర్ మొక్కల్ని ఇంట్లో ఎక్కువగా పెట్టుకోవడం వల్ల అవి గదుల్ని( ROOMS) సహజంగా చల్లబరుస్తాయట. దీంతో వేడి తగ్గి మనం హాయిగా ఉండగలుగుతాం. అందుకనే ఇంట్లో కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేసుకున్నా కొన్ని మొక్కల్ని కూడా పెట్టుకోమని నిపుణులు సలహా ఇస్తున్నారు.
మొక్కలు ఉన్న చోట చల్లగా ఉండటాన్ని మనం తరచుగా ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాం. అలాగే ఇంటి లోపల కూడా కొన్ని రకాల మొక్కల్ని ఉంచుకోవడం వల్ల అవి సహజమైన హ్యుమిడిఫయర్లుగా పని చేస్తాయి. చల్లదనాన్ని అందిస్తాయి. అలాంటి ఇండోర్ ప్లాంట్స్‌లో(INDOOR PLANTS) మనం చెప్పుకోదగ్గ మొక్కలు కొన్ని ఉన్నాయి. బోస్టన్ ఫెర్న్, స్పైడర్ ప్లాంట్, పీస్ లిల్లీ, అరేకా పామ్, స్నేక్ ప్లాంట్, కలబంద… లాంటి మొక్కలు ఇంట్లో చక్కగా పెరుగుతాయి. వేసవిలో గది ఉష్ణోగ్రతను కాస్త చల్లబరుస్తాయి.
ఈ మొక్కలన్నీ(PLANTS ) మనకు నర్సరీల్లో తేలికగా లభ్యం అవుతాయి. ధర కూడా రెండు, మూడు వందల రూపాయల లోపే ఉంటాయి. వీటిని మెయింటెన్ చేయడం కూడా చాలా సులభం. రెండు రోజులకు ఒకసారి నీరు పోస్తూ ఉన్నా సరిపోతుంది. కాబట్టి వీటిని ఇంట్లో తెచ్చి పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒకటో రెండో కాకుండా కాస్త ఎక్కువ పచ్చదనం ఉండేలా చూసుకోండి. అప్పుడు గదుల్లో వాతావరణం కాస్త చల్లగా(COOLING) అయి ఉండటానికి మీకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.