కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (MLC Jeevan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల నామినేషన్ వరకు ఎవరు ఏ పార్టీలో ఉంటే ఆ నాయకుడు ఆపార్టీ నాయకుడు అనుకోవాలని జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా(Jagityala District) కేంద్రంలోని ఇందిరా భవన్ లో మీడియ సమావేశంలో ఆయన మాట్లాడారు.నేను ఎంపీ గా పోటీచేయాలనుకుంటే నాకు ఎవరు అడ్డుకాదన్నారు. కరీంనగర్, నిజామాబాద్ (Nizamabad) ఎంపీ రెండు స్థానల్లో పార్టీ ఆదేశిస్తే ఎక్కడినుండి అయినా పోటీ చేస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) పార్టీ మరే టాక్ ఉందని జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. పొన్నం ప్రభాకర్ కి పార్టీ మరే ఆలోచన లేదు అని స్పష్టం చేశారు.ఓటు మీరు వెయ్యలి నోటు మీరే ఇయ్యాలి అంటూ వ్యాఖ్యానించారు. నామినేషన్ (Nomination) వేసేంతవరకు నా వంతు… తర్వాత పార్టీ నాయకుల వంతు అన్నారు. భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ని సంప్రదిస్తే ప్రేమ్ సాగర్ రావు పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారని క్లారిటీ ఇచ్చారు. అయితే గత కొంత కాలంగా ఉత్తమ్ పార్టీ మారుతారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జీవన్ రెడ్డి చేసిన కామెంట్ లు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి.