పెళ్లి శుభకార్యాల్లో సినిమా పాటలు ప్లే చేయడం కాపీరైట్ (Copyright) ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వివాహ వేడుకల్లో సాంగ్స్ పై రాయల్టీ వసూలు చేయకూడదని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ స్పష్టం చేసింది. కాపీ రైట్ యాక్ట్ 1957 లోని సెక్షన్ 52(1)(za) ప్రకారం మతపరమైన కార్యక్రమాలు, అధికారిక వేడుకల్లో ప్రదర్శించే నాటక, సాహిత్య లేదా మ్యూజిక్/ ఏదైనా సౌండ్ రికార్డింగ్ లు కాపీరైట్ ఉల్లంఘన కిందకు రావని చెబుతోందని పెళ్లి(wedding)కి సంబంధించిన ఇతర కార్యక్రమాలు మతపరమైన వేడుకల కిందకే వస్తాయని పెర్కొన్నారు.
పెళ్లిళల్లో సినిమా పాటలు ప్లే చేస్తే ఆయా సంస్థలు రాయల్టీ (Royalty) వసూలు చేస్తున్నాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో కేంద్రం ఈ స్పష్టత ఇచ్చింది. వివాహ ఊరేగింపుతోపాటు పెళ్లికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు కూడా మతపరమైన వేడుకల కిందకే వస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని కాపీరైట్ సంస్థలు వీటికి దూరంగా ఉండాలి’ అని పేర్కొంటూ డీపీఐఐటీ (DPIIT) ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది.వీటికి సంబంధించి ఎవరైనా వ్యక్తులు/యాజమాన్యాలు/కాపీరైట్ సంస్థలు చేసే డిమాండ్లను అంగీకరించవద్దని సాధారణ పౌరులకూ డీపీఐఐటీ సూచించింది. ప్రభుత్వం చేసిన ప్రకటనను సామాన్యులతో పాటు ఆతిథ్య రంగం కూడా స్వాగతించింది.