భారతదేశ అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.అప్పులపై ఆర్థిక నిపుణులు (Financial experts) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇవి ఓ ప్రైవేటు కంపెనీలు తెలిపిన వివరాలు కానే కాదు.. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ప్రభుత్వ స్థూల రుణంలో 2.2శాతం పెరుగుదల నమోదు కాగా.. రుణాల మొత్తం రూ.159లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. దేశంలోని 14 మంది ప్రధానులు కలిసి గత 67 ఏళ్లలో మొత్తం రూ.55 లక్షల కోట్ల రుణం తీసుకున్నారు. గత 9 ఏళ్లలో ప్రధాని మోదీ (PMMODI) మన దేశ రుణాన్ని 3 రెట్లు పెంచారు. ఆయన నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 9 సంవత్సరాలలో 100 లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణం తీసుకుంది.
2014లో భారత ప్రభుత్వం(Government of India)పై ఉన్న మొత్తం అప్పు రూ.55 లక్షల కోట్లు కాగా, ఇప్పుడది (2023లో) 181% పెరిగిపోయి రూ.155 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత దేశ జనాభా బిలియన్ 40కోట్లు. ఈ లెక్క దేశంలోని ప్రతి పౌరుడిపై ప్రస్తుతం రూ.1.13లక్షల కంటే ఎక్కువగానే అప్పు ఉండనున్నది. అయితే, ఈ అప్పు(Debt)ల పెరుగుదలకు సంబంధించిన గణాంకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నివేదిక ద్వారా సమర్పించింది.ఈ నివేదిక ప్రకారం.. మార్చి చివరి వారంలో కేంద్ర సర్కారు (Central Govt) స్థూల రుణం రూ.156.08లక్షల కోట్లు. 2023 ఏప్రిల్-జూన్ త్రైమాసికం నాటికి ఇది 2.2 శాతం పెరిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ విభాగానికి చెందిన పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ సెల్ ఏప్రిల్-జూన్ 2010-11 నుంచి రుణ నిర్వహణపై క్రమం తప్పకుండా త్రైమాసిక నివేదికను విడుదల చేస్తుంటుంది.