దేశంలో సైబర్ దాడుల (Cyber attacks) ముప్పు పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్ర సరికొత్త ఆలోచన చేసింది. నూతన సైబర్ కమాండోస్ విభాగాన్నికేంద్ర ప్రభుత్వం (Central Govt) ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా భవిష్యత్తులో సైబర్ దాడులకు సన్నద్ధంగా ఉండాలన్న సర్కారు యోచన కనిపిస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు దళాలు, కేంద్ర పోలీసు బలగాల నుంచి చురుకైన వారిని నియమించుకుని, సైబర్ నైపుణ్యాలు, దాడుల విషయంలో వారిని సుశిక్షితులుగా కేంద్ర హోంశాఖ (Central Home Ministry) తీర్చిదిద్దనుంది.ఐటీ సెక్యూరిటీ(IT Security), డిజిటల్ ఫోరెన్సిక్ విభాగాల్లో సైబర్ కమాండోలు తగినంత పరిజ్ఞానం కలిగి ఉంటారు. సైబర్ కమాండోస్ విభాగం పోలీసుల విభాగాల్లో అంతర్భాగంగా ఉండనుంది.
అర్హులైన 10 మంది సైబర్ కమాండోలను గుర్తించాలంటూ కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ తాజాగా కోరింది. జనవరిలో డీజీపీ/ఐజీల మీటింగ్లో ప్రధాని మోదీ (Pm modi) కమాండోస్ ఏర్పాటు ప్రతిపాదన తీసుకొచ్చారు.అది ఇప్పటికి సాకార రూపం దాల్చబోతోంది.కొత్తగా ఏర్పాటు చేయనున్న సైబర్ కమాండోస్ (Commandos) విభాగం.. సైబర్ దాడుల ముప్పును ఎదుర్కొంటుంది.ఐటీ నెట్ వర్క్ ను కాపాడుతుంది. సైబర్ విభాగాలకు సంబంధించి దర్యాప్తు వ్యవహారాలు చూస్తుంది. ఐటీ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్ (Forensic) విభాగాల్లో సైబర్ కమాండోలకు మరింత పరిజ్ఞానం కలిగి ఉండాలి.ఇందుకు కావాల్సిన ట్రైనింగ్ ఇస్తారు. సైబర్ కమాండోస్ విభాగం పోలీసుల విభాగాల్లో అంతర్భాగంగా ఉండనుంది.