»A Video Of A Match In The European Cricket League Has Recently Gone Viral
Viral Video: క్రికెట్ లీగ్‌లో గమ్మత్తు సంఘటన..వైరల్ వీడియో
క్రికెట్ మ్యాచ్‌లలో బ్యాటర్లు, బౌలర్లు, ఫీల్డర్లు చేసే ఫీట్లు కొన్నిసార్లు నవ్వు తెప్పించడంతోపాటు తమ జట్టుకు అపార నష్టాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
A video of a match in the European Cricket League has recently gone viral
European Cricket League: క్రికెట్ మ్యాచ్(Cricket match) అంటే ఒక ఎమోషన్‌లా ట్రీట్ చేస్తారు అభిమానులు. మ్యాచ్ జరుతున్నప్పుడు ఏదో థ్రిల్లర్ సినిమాను చూసినట్లు, ఏదో ఫజిల్‌ను సాల్వ్ చేస్తున్నట్లు సీరియస్ గా ఉంటారు. అయితే అప్పుడప్పుడు కొన్ని నవ్వు తెప్పించే సీన్లు జరుగుతుంటాయి. బ్యాటర్లు, బౌలర్లు, ఫీల్డర్లు చేసే ఫీట్లు కొన్నిసార్లు నవ్వు తెప్పించడంతోపాటు తమ జట్టుకు అపార నష్టాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఓ క్లబ్ క్రికెట్లో జరిగిన సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. యూరోపియన్ క్రికెట్ లీగ్(European Cricket League)లో భాగంగా టీ10 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. దీనిలో యునైటెడ్ క్రికెట్ క్లబ్(United Cricket Club), ప్రాగ్యూ టైగర్స్ (Prague Tigers) మధ్య మ్యాచ్ జరిగింది. యునైటెడ్ జట్టుకు చివరి రెండు బంతుల్లో మూడు పరుగుల అవసరం ఉంది. అలాంటి సమయంలో ఇరు జట్లు ఎంతో తీక్షణంగా మ్యాచ్‌ను చూస్తున్నాయి. ఇంత క్లిష్టమైన తరుణంలో వికెట్ కీపర్ రనౌట్ చేసేందుకు ప్రయత్నించి మొత్తం ఆటనే తలకిందులు చేశాడు. ఈ ఆటలో యునైటెడ్ క్రికెట్ క్లబ్ విజేతగా నిలవడం విశేషం.
మొదట బ్యాటింగ్ చేసిన ప్రాక్యూ టైగర్స్(Prague Tigers) పది ఓవర్లలో 109/5 స్కోరు చేసింది. అనంతరం యునైటెడ్ క్రికెట్ క్లబ్(United Cricket Club) కూడా దూకుడుగానే ఆడి 19.5 ఓవర్లలో రెండు వికెట్లను మాత్రమే నష్టపోయి విజయం సాధించే దిశగా పరుగులు చేస్తోంది. అయితే, చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు చేయాల్సి ఉంది. యునైటెడ్ బ్యాటర్లు ఆయుష్ శర్మ, అభిమన్యు సింగ్ క్రీజ్‌లో ఉన్నారు. టైగర్స్ బౌలర్ చక్కగా బాలు త్రో చేశాడు. దాన్ని ఆడడంలో విఫలమయ్యాడు బ్యాట్స్‌మెన్. అదే సమయంలో వికెట్ కీపర్ బాల్‌ను సరిగ్గా పట్టలేకపోయాడు. దీంతో బ్యాటర్లు పరుగు తీసేందుకు ప్రయత్నించారు. వికెట్ కీపర్ వెంటనే బంతిని కాలితో వికెట్ల మీదకు తన్నాడు. అది స్టంప్స్‌ను తాకకుండా దూరంగా వెళ్లిపోయింది. అక్కడి నుంచి ఓ ఫీల్డర్ బాల్‌ను విసిరాడు. దాన్ని క్యాచ్ పట్టలేక పోయారు. అప్పటికే రెండు పరుగులు తీశారు. ఇక మరో ఫీల్డర్ బాల్ వికెట్ల మీదకు బలంగా విసిరాడు. అది కాస్త నేరుగా ఫోర్ బౌండ్రీకి చేరింది. ఇంకెముంది ఇంకో బాల్ మిగిలి ఉండగానే యునైటెడ్ క్రికెట్ క్లబ్ విజయం సాధించింది. గత వారం జరిగిన ఈ మ్యాచ్ తాజాగా వైరల్‌గా మారింది.