»Minister Roja Spoke Strongly About Pawan Kalyan And Chandrababu In The Anantapur Press Meet
Roja: పవన్ కళ్యాణ్ వార్డు మెంబర్గా గెలుస్తాడా?
ఏపీలో పవన్ కళ్యాణ్ వలన మిస్ అయిన అమ్మాయిలు ఎంతమందో లెక్క తేలాలన్నారు మంత్రి రోజా. చంద్రబాబు నిజమైన రాయలసీమ ద్రోహి అని, గంజాయి, ఎర్రచందనం నారావారిపల్లిలో దొరుకుతాయని ఎద్దేవా చేశారు.
Roja: అనంతపురం(Anantapuram) ప్రెస్ మీట్లో ఏపీ మంత్రి రోజా(Roja) టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan)ల గురించి తీవ్రస్థాయిలో మాట్లాడింది. ఏపీలో అమ్మాయిలు మాయం అవడం కాదు. పవన్ వలన ఎంతమంది మిస్ అయ్యారో లెక్క తేలాలన్నారు. చంద్రబాబు పాలనలో వలసలు, బిక్షాటన చేసిన పరిస్థితులు చూశామన్నారు. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన తరువాత మళ్లీ అంతటి గొప్ప పరిపాల వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ పాలనలో చూస్తున్నామన్నారు.
నిజమైన రాయలసీమ ద్రోహి(Rayalaseema traitor) చంద్రబాబు నాయుడు. రాయలసీమలోనే పుట్టి పెరిగి మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి అయినా కూడా ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా ఆయన తీసుకురాలేదన్నారు. అనంతపూర్లో ఎయిమ్స్ కూడా మంగళగిరికి తరిలించిన ఘనత చంద్రబాబుది అన్నారు. అలాంటిది ముఖ్యమంత్రి జగన్(CM Jagan) పాలనను నిలదీస్తున్నారు. కరోనాతో ప్రపంచం అంతా రెండు సంవత్సరాలు అతలాకుతలం అయిన విషయం తెలియాదా… అని మంత్రి రోజ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరువాత పాలనలోకి వచ్చిన చంద్రబాబు చేసింది ఏముంది. కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్రం పూర్తి చేస్తుందని దానిపై దోపిడి చేసిన వ్యక్తి ఆయన అన్నారు. సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీలు అన్ని ఎగ్గోట్టి హైదరాబాద్ లో తలదాచుకున్న చంద్రబాబు ప్రాజెక్టుల గురించి మాట్లాడం సిగ్గుచేటు అన్నారు. ఇక చంద్రబాబు పాలనలో రాష్ట్రం కురువుతో విలవిలలాడిందని, కరువు చంద్రబాబు కవల పిల్లలని అన్నారు. ఇక వైసీపీ పాలనలో అభివృద్ది పరుగులు పెడుతుందని, రైతుల పక్షపాతంగా పాలన కొనసాగిస్తుందని అన్నారు.
ఇక ఏపీలో మహిళల అదృశ్యంపై పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ కు ఏం మాట్లాడాలో తెలియదని, రాజకీయ అవగాహన లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతారని అన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ రాసిస్తే దాన్నే ఫాలో అవుతారని, ఒక్క ప్రశ్న ఎక్కవ అడిగినా సమాధానం చెప్పడు అన్నారు. పవన్ కళ్యాణ్ వలన ఎంత మంది మిస్ అయ్యారో ఆ లెక్కలు ముందు తేలాలి అన్నారు. ఓ కేంద్ర నిఘా సంస్థ తనకు రిపొర్టు ఇచ్చిందని పవన్ దొంగ లెక్కలు చెబుతున్నారు. సెంట్రల్ రిపోర్టులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. కానీ వార్డు మెంబర్ కూడా గెలువని ఈయనకెందుకు ఇస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఏపీలో మహిళల మిస్సింగ్ పై పవన్ కు ఏ నిఘా సంస్థ సమాచారమిచ్చిందో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఏపీలో హెరిటేజ్ పాల వ్యాన్లలో గంజాయి, నారావారిపల్లిలో ఎర్రచందనం దొరుకుతాయని ఆరోపించారు.
చదవండి:World Hepatitis Day : హెపటైటిస్ ఎలా వస్తుంది.. నివారణ చర్యలు?