MP Revanth Reddy Missing Poster Shown At Malkajgiri
MP Revanth Reddy Missing Poster: వారం, పది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్లో కుండపోత వాన పడుతుంది. దీంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. తేలికపాటి జల్లులకే హైదరాబాద్ కాలనీల్లోకి నీరు చేరుతుంది. వర్షం, ముసురు పట్టడంతో ఆ సిచుయేషన్ చెప్పక్కర్లేదు. వర్షం, వరదల సమయంలో నేతలు వచ్చి సాయం చేయాలి. అధికార పార్టీ నేతలు పర్యటిస్తున్నారు. మిగతా నేతలు అంతగా పట్టించుకోవడం లేదు.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పోస్టర్లు వెలశాయి. స్థానిక ఎంపీ, టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (MP Revanth Reddy) కనిపించడం లేదనేది అందులోని సారాంశం. రేవంత్ (Revanth) మిస్సింగ్ అని పోస్టర్స్ వెలిశాయి. ఇప్పుడే కాదు 2020లో వరదలు వచ్చిన సమయంలో రేవంత్ (MP Revanth Reddy) పత్తా లేకుండా పోయారని అంటున్నారు. ఇప్పుడు వర్ష బీభత్సం కొనసాగినప్పటికీ లెక్క చేయలేదని అంటున్నారు.
మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కనబడుటలేదని నియోజకవర్గంలో వెలిసిన పోస్టర్లు
2020 వరదలు వచ్చినప్పుడు రాలేదు, 2023లో వర్షాలు వస్తున్న రాలేదు అంటూ పోస్టర్లు. pic.twitter.com/5gXtOk2XbQ
ఇదివరకు కూడా హైదరాబాద్లో పోస్టర్లు వెలిశాయి. బీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు కనిపించాయి. ఈ సారి డిఫరెంట్.. ఇష్యూ మీద పోస్టర్ కనిపించాయి. మరీ ఇకపై రేవంత్ దర్శనం ఇస్తారో లేదో చూడాలీ. వర్షం ప్రభావంపై నిన్న కేటీఆర్కు రేవంత్ (Revanth) ట్వీట్ చేశారు. ఈ రోజు జీహెచ్ఎంసీ వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. కానీ కాంగ్రెస్ స్టేట్ చీఫ్ కనిపించలేదు. నియోజకవర్గంలో కూడా అందుబాటులో లేరని.. అందుకోసమే పోస్టర్లు వెలిశాయి.