తెలంగాణ సచివాలయం వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులు తీవ్ర నిరసన తెలిపారు. తమ డిమాండ్‌ను వినిపిస్తూ వారు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
నారా లోకేష్, పవన్‌కల్యాణ్‌లతోపాటు చంద్రబాబు నాయుడు ప్రవర్తన ప్రజలకు తెలియజేసేందుకే తాను ‘అల్లుడు సుద్దులు’ పుస్తకం రాశానని లక్ష్మీ పార్వతి తెలిపారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. వాతావరణశాఖ హెచ్చరికలతో మరోసారి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపై అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారీ ఇలా సెలవులు ఇస్తే విద్యార్థుల చదవుల పరిస్థితి ఎంటని ప్రశ్నిస్తున్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కోరగా, ధర్మాసనం తిరస్కరించింది.
మణిపూర్ రగిలిపోతుంది. రిజర్వేషన్ల కోసం రెండు వర్గాల గొడవలోకి.. శరణార్థులు ప్రవేశించారని తెలిసింది. 718 మంది సరైన ధృవపత్రాలు లేకుండా దేశంలోకి వచ్చి.. గొడవలకు కారణం అని తెలిసింది.
జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా ప్రతినిధి2 సినిమా ప్రకటించిన తరువాత తెరపైకి అనేక విషయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇది కచ్చితంగా ఏపీ రాజకీయాలను ఉద్దేశించే తెరకెక్కించనున్నారని ఆరోపణలు మొదలయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పగా మారిందని విపక్షాలు విమర్షస్తున్నాయి. సౌత్ ఇండియాలో రుణాలు తీసుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం నెం 1 స్థానంలో ఉందని నిర్మల సీతారామన్ పార్లమెంట్‌లో స్పష్టం చేశారు.