Etala Rajender: సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అందరినీ భయపెట్టారని పేర్కొన్నారు. గెస్ట్ లెక్చరర్ల సమస్యను తాను అసెంబ్లీలో ప్రస్తావించానని.. చాలీచాలని జీతాలతో ఇబ్బంది పడుతున్నారని గుర్తుచేశారు. వారికి మినిమం క్లాసులు లేవని.. మ్యాగ్జిమమ్ క్లాసులు ఉన్నావని.. అలాగే ఏడాదికి సరిపడ జీతం రాదని గుర్తుచేశారు. కాలేజీ ఉన్నా లేకున్నా.. ఏడాదిపాటు జీతం అందజేయాలని కోరానని తెలిపారు. కానీ ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ పెడచెవిన పెట్టారని ఈటల రాజేందర్ (Etala Rajender) మండిపడ్డారు.
ఒక్క గెస్ట్ లెక్చరర్లే కాదు.. వీఆర్ఏ వ్యవస్థను నిర్వీర్యం చేయడం ఎంతవరకు సమంజసం అని అడిగారు. వీఆర్వో వ్యవస్థను తీసివేశారని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తే.. బెదిరించి, భయపెట్టి.. విరమింపజేశారని పేర్కొన్నారు. ఇలా ఎవరూ సమ్మె బాట పట్టినా అంతే సంగతులు.. అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. చివరికీ వీఏవోలు కూడా ధర్నా చేస్తే.. ఉద్యోగం నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారని తెలిపారు. ధనిక రాష్ట్రం తెలంగాణలో వారికి 3900 జీతం ఇస్తే.. పక్కన గల ఏపీలో.. అప్పులు తీసుకొచ్చి రూ.10 వేల వేతనం అందజేస్తున్నారని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉద్యోగులు కోపంతో ఉన్నారని వివరించారు. ఎన్నికల సమయంలో బుద్ది చెబుతారని ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు.