ys viveka: వివేకా (ys viveka) పేరు మీద మచ్చ పడొద్దని అవినాష్ రెడ్డి, ఆయన కుటుంబం మూడేళ్లుగా మౌనంగా ఉన్నారు.. భరించారని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చనిపోయిన వారి గౌరవం కాపాడేందుకు అవినాష్, అతని తండ్రి ప్రయత్నించారు.. కానీ బతికి ఉన్న వారిని బజారుకీడ్చే పనిలో మిగతా వారు ఉన్నారని మండిపడ్డారు. వివేకా హత్యకు కారణమైన అసలు దోషులు బయటకు రావాలని కోరుతున్నాం అని స్పష్టంచేశారు.
వివేకా (ys viveka) హత్యకు ముందు అవినాష్‌తో మాట్లాడితే తప్పేంటి అని సజ్జల అడిగారు. పార్టీ నేతలు, సొంత పెద్దనాన్నతో మాట్లాడటం తప్పేంటి అన్నారు. చనిపోయే రెండురోజుల ముందు తాను కూడా మాట్లాడానని చెప్పారు. పార్టీ నేతల చేరిక గురించి తమ మధ్య డిస్కషన్ జరిగిందని వివరించారు. వివేకా కూతురు సునీత.. చంద్రబాబు వైపు వెళ్లడాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు.
అవినాష్‌ను (avinash) డిపెండ్ చేయాలని తాను సునీతకు చెప్పలేదని సజ్జల పేర్కొన్నారు. వివేకా (ys viveka) హత్య కేసు విచారణతో సీబీఐ ప్రతిష్ట మసకబారింది.. రెండు సిట్లు పేర్కొన్న అంశాలను సీబీఐ మరచిపోయిందని వివరించారు. దర్యాప్తు సంస్థలను చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. అనుమానాలు ఓ వైపు ఉంటే.. దర్యాప్తు మరోలా సాగిందని.. ఎంక్వైరీని చంద్రబాబు ఇంఫెక్ట్ చూపారని వివరించారు.
వివేకానంద (ys viveka) ఎమ్మెల్సీగా ఓడిపోవడం తమకే ఆశ్చర్యం కలిగించిందని సజ్జల అన్నారు. 2011లో అవినాష్ తన ప్రతినిధి అని జగన్ ప్రకటించారు. 2014లో అవినాష్ పోటీ చేసి, గెలిచారు. టికెట్ విషయంలో గొడవ లేదని పేర్కొన్నారు.